ప్రేమించేటప్పుడు కూడా తన కన్నా చిన్న వయస్సు వాళ్లనే చూసుకుంటూంటారు మగాళ్లు. అయితే అప్పుడప్పుడూ తన కన్నా పెద్దవాళ్లతోనూ వ్యవహారం నడిపేస్తూంటారు. పెద్ద వయస్సు అమ్మాయితో ప్రేమలో పడే కుర్రాడి పరిస్దితి ఎలా ఉంటుంది. అదీ మరీ పదిహేనేళ్లు ఏజ్ గ్యాప్ ఉంటే..అనుష్క లాంటి అందగత్తె ఎదురైతే వయస్సు ఏముంది అనిపించవచ్చు. ఇప్పుడు ఓ కుర్రాడి పరిస్దితి అదేనట.
ప్రేమించేటప్పుడు కూడా తన కన్నా చిన్న వయస్సు వాళ్లనే చూసుకుంటూంటారు మగాళ్లు. అయితే అప్పుడప్పుడూ తన కన్నా పెద్దవాళ్లతోనూ వ్యవహారం నడిపేస్తూంటారు. పెద్ద వయస్సు అమ్మాయితో ప్రేమలో పడే కుర్రాడి పరిస్దితి ఎలా ఉంటుంది. అదీ మరీ పదిహేనేళ్లు ఏజ్ గ్యాప్ ఉంటే..అనుష్క లాంటి అందగత్తె ఎదురైతే వయస్సు ఏముంది అనిపించవచ్చు. ఇప్పుడు ఓ కుర్రాడి పరిస్దితి అదేనట. అనుష్కతో గాఢంగా ప్రేమలో పడి..ఆ ప్రేమని మొదట ఆమెతో చెప్పి ఒప్పించేందుకు పడే కష్టాలు..ఆ తర్వాత పెద్దలను ఒప్పింటం, సమాజాన్ని కన్వీన్స్ చేయటం బోలెడు కథ నడుస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎవరా కుర్రాడు. నిజంగా అనుష్క ప్రేమలో పడిందా అంటారా..కంగారుపడకండి..సినిమా కోసమే.
వివరాల్లోకి వెళితే...స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన నిశ్శబ్దం ఓటీటి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అనుష్క ఏ సినిమా కు సైన్ చేసింది లేదు. నిశ్శబ్ధం ఫ్లాఫ్ తో తన తర్వాతి సినిమా విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది స్వీటీ. భాగమతి టైమ్ లోనే యువీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క ఇంకో సినిమాకు అగ్రిమెంట్ ఇచ్చింది. కానీ అప్పటి నుంచి వారితో మరో సినిమా మాత్రం చేయలేదు. ఇప్పుడు మహేష్ అనే డైరక్టర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చెప్పేసిందని బౌండ్ స్క్రిప్ట్ తో అనుష్క ను ఒప్పించాడని దీంతో అనుష్క ఈ సినిమా కు ఓకే చెప్పేసిందని అంటున్నారు.
అయితే ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ ఫన్నీ ఎలిమెంట్ తో సాగనున్న ఈ డ్రామా ఆద్యంతం ఆకట్టుకోనుందట. మరి అనుష్క తో రొమాన్స్ చేయనున్న ఆ హీరో ఎవరా అంటే ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఆ ఛాన్స్ నవీన్ పోలిశెట్టికి దక్కిందట. 40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం..‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో, సూపర్ హిట్ అండ్ ఫీల్ గుడ్ మూవీస్ అందించిన యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. మే నుండి షూటింగ్ స్టార్ట్ కానుంది..
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో సూపర్ హిట్ అందుకున్న నవీన్ కు ఇప్పుడు అనుష్క తో హీరోగా చేసే ఛాన్స్ దక్కడమంటే లక్కీ అంటున్నారు. యువీ క్రియేషన్స్, అనుష్క కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలుస్తుంది. మరో ప్రక్క నవీన్ పోలిశెట్టి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న విడుదలవుతోంది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది..