రెమ్యూనరేషన్‌తో షాక్‌ ఇస్తున్న కృతి శెట్టి.. నిర్మాతకి మతిపోయిందట

By Aithagoni Raju  |  First Published Mar 8, 2021, 10:36 AM IST

సక్సెస్‌ ఉన్నప్పుడు, క్రేజ్‌ ఉన్నప్పుడు ఓ పది రాళ్లు వెనకేసుకోవాలని హీరోహీరోయిన్లు భావిస్తుంటారు. ఆ మేరకు ప్లాన్‌ చేస్తున్నారు. రెమ్యూనరేషన్స్ పెంచేసి, వర్క్ కండీషన్స్ తో నిర్మాతలకు మతిపోగొడుతుంటారు. అయితే కెరీర్‌ ప్రారంభించిన కొన్నాళ్లకి గానీ ఈ పరిస్థితి రాదు. కానీ `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అలా చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. 


దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగులో బాగా పాపులర్‌ అయిన సామెత. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. సినిమా రంగానికి ఇంకాస్త బాగా వర్తిస్తుంది. వర్కౌట్‌ అవుతుంది. సక్సెస్‌ ఉన్నప్పుడు, క్రేజ్‌ ఉన్నప్పుడు ఓ పది రాళ్లు వెనకేసుకోవాలని హీరోహీరోయిన్లు భావిస్తుంటారు. ఆ మేరకు ప్లాన్‌ చేస్తున్నారు. రెమ్యూనరేషన్స్ పెంచేసి, వర్క్ కండీషన్స్ తో నిర్మాతలకు మతిపోగొడుతుంటారు. అయితే కెరీర్‌ ప్రారంభించిన కొన్నాళ్లకి గానీ ఈ పరిస్థితి రాదు. కానీ `ఉప్పెన` ఫేమ్‌ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అలా చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. 

ఈ `ఉప్పెన` సునామి కృతి శెట్టి  రెమ్యూనరేషన్ తోపాటు వర్కింగ్‌ కండీషన్స్ పెట్టి దిమాక్‌ ఖరాబ్‌ చేస్తుందట. తొలి సినిమా `ఉప్పెన`తోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది కృతి. ఇందులో అద్భుతమైన నటనతోపాటు, మతిపోగొట్టే ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆడియెన్సే కాదు, టాలీవుడ్‌ కూడా ఫిదా అయ్యింది. ఇక దర్శక, నిర్మాతలైతే కృతితో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆమె చుట్టూ తిరుగుతున్నారు. 

Latest Videos

వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ఆమె నటించిన `ఉప్పెన` చిత్రం వంద కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం డెబ్యూ టీమ్‌ చేసిన ఈసినిమా ఊహించని విధంగా సంచలనం సృష్టించింది. ఈ సక్సెస్‌లో కృతి పాత్ర చాలా ఉంది. ఈ సినిమా హిట్‌ కావడంతో ఈ క్యూట్‌ అందాల భామకి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నానితో `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలతోపాటు రామ్‌తో లింగుస్వామి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. 

లేటెస్ట్ గా ఒప్పుకున్న సినిమాకి కృతి కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిందట. ఓ నిర్మాతకైతే కోటి రూపాయల రెమ్యూనరేషన్‌తోపాటు ఇతర వర్కింగ్‌ కండీషన్స్, ఫెసిలిటీస్‌ కండీషన్స్ పెట్టి పెద్ద షాక్‌ ఇచ్చిందట. సరే కృతికున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకున్న నిర్మాత కోటీ రూపాయల రెమ్యూనరేషన్‌కి ఓకే చెప్పాడని, కానీ ఆమె పెట్టిన ఇతర కండీషన్స్ కి మాత్రం దిమ్మతిరిగిపోయిందట. దీంతో ఇతర సినీ వర్గాల వద్ద తమ గోడుని వెల్లడించాడని టాక్‌. మొత్తానికి ఇప్పుడు కృతిని ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  

click me!