నేను జనం మనిషిని అంటోన్న పవన్‌.. `సత్యమేవ జయతే` సాంగ్‌ ట్రెండింగ్‌..

Published : Mar 03, 2021, 05:23 PM IST
నేను జనం మనిషిని అంటోన్న పవన్‌.. `సత్యమేవ జయతే` సాంగ్‌ ట్రెండింగ్‌..

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న `వకీల్‌సాబ్‌` చిత్రం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌`కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలోని `సత్యమేవ జయతే` అనే పాటని బుధవారం విడుదల చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `వకీల్‌ సాబ్‌` చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుపుకుంటోంది. శృతి హాసన్‌ హీరోయిన్‌గా, అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌`కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. 

తాజాగా ఈ చిత్రంలోని రెండోపాట `సత్యమేవ జయతే` అనే పాటని బుధవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. దేశ భక్తిని రగిల్చేలా, పవన్‌ హీరోయిజం హైలైట్‌ చేస్తూ `జనం మనిషి రా.. ` అంటూ ప్రారంభమైన ఈ పాట పవన్‌ అభిమానులనే కాదు, సాధారణ ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. పవన్‌ ఫ్యాన్స్ పాటని షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.  రెండేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?