వర్క్  ఫ్రంమ్ హోమ్ కష్టాలు వివరించిన అక్షయ్ భార్య ట్విన్కిల్ ఖన్నా

Published : Mar 03, 2021, 03:52 PM IST
వర్క్  ఫ్రంమ్ హోమ్ కష్టాలు వివరించిన అక్షయ్ భార్య ట్విన్కిల్ ఖన్నా

సారాంశం

ట్విన్కిల్ ఖన్నా రచయిత కూడాను. పత్రిలకు కాలమిస్ట్ గా కూడా ఆమె పనిచేస్తారు. తాను ఇంట్లో రచనలు చేసుకుంటుంటే తన పిల్లలు ఆటంకంగా తయారయ్యారట. ట్విన్కిల్ తన బెడ్ పై కూర్చుని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుంటే... ఎనిమిదేళ్ల నితార జిమ్నాస్టిక్స్ చేస్తున్నారట. మరోవైపు పొరుగింటిలో గోడను డ్రిల్లింగ్ చేస్తున్న శబ్దాలు వస్తున్నాయట.   

వర్క్ ఫ్రంమ్ హోమ్ కష్టాలు సామాన్యులకే కాదు, వందల కోట్ల సంపాదన కలిగిన స్టార్ వైవ్స్ కి కూడా ఉన్నాయంట. ఇంటిలో వర్క్ చేయడం ఎంత కష్టమో హీరో అక్షయ్ కుమార్ వైఫ్ ట్విన్కిల్ ఖన్నా తెలియజేశారు. ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. గతంలో హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించారు ట్విన్కిల్ ఖన్నా. ఆమె తెలుగులో వెంకటేష్ హీరోగా 1999లో విడుదలైన శీను చిత్రంలో హీరోయిన్ గా నటిచడం జరిగింది. 2001లో అక్షయ్ కుమార్ ని వివాహం చేసుకున్న ఆమె వెండితెరకు గుడ్ బై చెప్పారు. 

ట్విన్కిల్ ఖన్నా రచయిత కూడాను. పత్రిలకు కాలమిస్ట్ గా కూడా ఆమె పనిచేస్తారు. తాను ఇంట్లో రచనలు చేసుకుంటుంటే తన పిల్లలు ఆటంకంగా తయారయ్యారట. ట్విన్కిల్ తన బెడ్ పై కూర్చుని లాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుంటే... ఎనిమిదేళ్ల నితార జిమ్నాస్టిక్స్ చేస్తున్నారట. మరోవైపు పొరుగింటిలో గోడను డ్రిల్లింగ్ చేస్తున్న శబ్దాలు వస్తున్నాయట. 

ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ట్విన్కిల్ ఖన్నా ఈ విషయాలు వెల్లడించాడు. పిల్లలు స్కూల్స్ వెళ్ళితే బాగుండని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. రచన లాంటి క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు డిస్టబెన్స్ ఉంటే చేయడం కష్టమే అని చెప్పాలి. ఇక అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సమ్మర్ కానుకగా ఇది విడుదల కానుంది. అలాగే సూర్య వంశీ, పృథ్విరాజ్, బచ్చన్ పాండే చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?