ఆ టైమ్‌ వచ్చింది.. సోహైల్‌ హీరోగా సినిమా షూటింగ్‌ స్టార్ట్..

Published : Mar 03, 2021, 03:32 PM ISTUpdated : Mar 03, 2021, 05:07 PM IST
ఆ టైమ్‌ వచ్చింది.. సోహైల్‌ హీరోగా సినిమా షూటింగ్‌ స్టార్ట్..

సారాంశం

ఇప్పటికే సోహైల్‌ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస్‌ వింజనంపతి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండగా, `జార్జిరెడ్డి` ఫేమ్‌ అప్పిరెడ్డి తన మైక్‌ మూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభమైంది. 

బిగ్‌బాస్‌4 పాపులర్‌ కంటెస్టెంట్‌ సోహైల్‌ కి ఇప్పుడు బయట విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇంతటి క్రేజ్‌ని అతను కూడా ఊహించి ఉండడు. హౌజ్‌లో చివరి రోజుల్లో ఆయన చేసిన హంగామే కారణం. ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు ఆయన్ని సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పటికే సోహైల్‌ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. శ్రీనివాస్‌ వింజనంపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండగా, `జార్జిరెడ్డి` ఫేమ్‌ అప్పిరెడ్డి తన మైక్‌ మూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. నిజార్‌ షఫీ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభమైంది. బుధవారం చిత్ర షూటింగ్‌ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. సోహైల్‌ సైతం తన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన సినిమా షూటింగ్‌ ప్రారంభమవడంతో సోహైల్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని, ఆడియెన్స్, ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు రానటువంటి కొత్త కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ని ప్రారంభించనున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?