
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లా మంచి మనసు చాటుకున్నాడు ఆయన తనయుడు అకీరా నందన్. 18 ఏళ్లు నిండటంతో తండ్రిలా సమాజసేవ మొదలు పెట్టాడు. మరి అఖీరా చేసిన సమాజసేవ ఏంటీ..? ఎందకు అకీరా హాట్ టాపిక్ అయ్యాడు.
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరానందన్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన ప్రతీ విషయం ఫ్యాన్స్ కు శేర్ చేస్తుంటాడు అకీరా. తన ప్రతీ యాక్టివిటీని అకీరా తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటుంటుంది. ఇక తండ్రి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరోగా, రాజకీయ నాయకుడిగా చేస్తున్న సేవను కొడుకు అకీరా ఆదర్శంగా తీసుకున్నాడు. రక్తదానం చేసి యూత్ కు ఇన్ స్పైర్ గా నిలిచాడు.
అకీరా నందన్ సినిమాల్లోకి రాబోతున్నాడని ఎప్పటికప్పుడు ఊహాగానాల జోరు పెరిగిన ప్రతిసారి లేదు.. రావడం లేదంటూ తల్లి రేణుదేశాయ్ ఖండించడం తరచూ జరిగేదే. ఈమధ్య కూడా రేణు దేశాయ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. అకీరాకు సినిమాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదంటూ తెగేసి చెప్పేసింది. అయితే అకీరానందన్ గురించి ఈసారి రేణు దేశాయ్ చేసిన ఈ కొత్త అప్డేట్ చర్చనీయాంశం అయింది.
ఈనెల 8న అకీరానందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. మేజర్ అవ్వడంతో తండ్రిని ఆదర్శంగా తీసుకున్న అకీరా వెంటనే రక్త దానం చేసి అందరి మనసు దొచుకున్నాడు. కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఊహించని రీతిలో అప్డేట్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇవాళ తన కుమారుడు అకీరా నందన్ రక్తదానం చేశాడంటూ ఫోటోను షేర్ చేశారు. 18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం అంటూ ప్రకటించారు రేణూ.
ఇక అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత వీలైనంత వరకు రక్తదానం చేయండి. మీరు ఎవరి ప్రాణాలను కాపాడగలరో మీకు ఎప్పటికీ తెలియదు..అంటూ రేణు దేశాయ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు.అకీరానందన్ రక్తం ఇస్తున్న సమయంలో తీసిన ఫోటో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అభిమానులు ఫోటో చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అకీరా..పవన్ కళ్యాణ్ కొడుకు అనిపించుకున్నాడు, నిజంగా కాలర్ ఎగరేయాల్సిందే అని అంటున్నారు. మరికొంతమంది జూనియర్ పవన్ కళ్యాణ్ అని ఆకాశానికెత్తేలా పొగిడేస్తున్నారు. మెగా హీరోలలో అందరికంటే పొడుగ్గా ఉండే అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి మనసు మార్చుకుని సినిమాలవైపు అకీరా అడుగులు వేస్తాడో లేదో చూడాలి.