Cobra Song Release: విక్రమ్ కోబ్రా నుంచి రిలీజ్ అయిన సాంగ్, మరోసారి రచ్చ చేసిన రెహమాన్

Published : Apr 23, 2022, 07:09 AM ISTUpdated : Apr 23, 2022, 07:11 AM IST
Cobra Song Release: విక్రమ్ కోబ్రా నుంచి రిలీజ్ అయిన సాంగ్, మరోసారి రచ్చ చేసిన రెహమాన్

సారాంశం

కోలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో ఉన్న విక్రమ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా కోబ్రా. ఈసినిమా నుంచి  మంచి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రెహమాన్ మార్క్ తో అద్భుతమైన సాంగ్ ను రిలీజ్ చేశారు. 

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయోగాలకు పెట్టింది పేరు విక్కమ్ కుమార్. చిత్ర విచిత్రమైన గెటప్పులు  చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు విక్రమ్. పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా  విక్రమ్ రెడీగా ఉంటాడు. అది ఇది అని లేదు... పాత్ర ఎంత ఇబ్బంది కరంగా ఉన్నా సరే .. దానికి వంద శాతం న్యాయం చేస్తాడు.  ఇంకా చేయాలన్నా సరే ఆయన సిద్ధంగా ఉంటారు. 

విక్రమ్ టాలెంట్ కు మచ్చుతునకల్లాంటి సినిమాలు అపరిచితుడు,ఐ సినిమాలు.ఇక విక్రమ్ గతంలో డ్యూయల్ రోల్ చేసిన ఇంకొక్కడు సినిమా కూడా ఆయన ప్రయోగాలలో ఒకటే. ఇక ఇప్పుడు కూడా ఆయన ఎక్స్ పెర్మెంట్స్ వైపే ఆలోచిస్తున్నాడు. ఇక కరోనా తరువాత విక్రమ్ సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో మే 26న కోబ్రా రిలీజ్ కు రెడీగా  ఉంది. ఈ సినిమాలో దాదాపు 25 పాత్రల్లో విక్రమ్ కనిపించబోతున్నాడు. ఆయన కెరీర్ లో అతి పెద్ద ప్రయోగం ఇదే. ఇక ఈసినమాతో పాటు మణిరత్నం తో పాటు పొన్నియన్ సెల్వన్ మూవీ చేస్తున్నాడు విక్రమ్. 

ఇక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన కోబ్రా సినిమాలో విక్రమ్ అనేక గెటప్పులలో కనిపించనున్నాడు. ఒక కథలో భాగంగా ఆయన ఇన్నిరకాల గెటప్పులు ధరించడం ఇదే మొదటిసారి. ప్రతి గెటప్పు వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయోజనం ఉంటుందని సమాచరం ఈ సినిమా గురించి ఆడియ్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 


  

లతీఫ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు.  ధీరా ధీరాధి ధీరా .. అధీరా అంటూ సాగే ఈ పాట సినిమాపై ఇంట్రెస్ట్ ను ఇంకా పెంచేస్తోంది.  శ్రీనిధి శెట్టి  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, మియా జార్జ్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. మే 25న ప్రపంచ వ్యాప్తంగా కోబ్రా మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?