మళ్లీ పవన్ గళం నుంచి జానపద గేయం

Published : Nov 21, 2017, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మళ్లీ పవన్ గళం నుంచి జానపద గేయం

సారాంశం

పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేదిలో పాట పాడిన పవన్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి చిత్రంలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడా సాంగ్... తరహాలో మరో జానపద గేయం పాడిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో కొడకా కొటేశ్వరావా.. అంటూ సాగే జానపదానికి పవన్ గళం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన  సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రానున్న మరో సినిమా అజ్ఞాతవాసి. ఆసక్తికరమైన కాంబోతో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి.

 

అజ్ఞాతవాసి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడట. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడా' అంటూ పాడిన సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న"అజ్ఞాతవాసి" చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్నారనే వార్త ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది.

 

యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా' అనే లైన్స్‌ తో ఉంటుందట. ఈ పాట ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు తాజాగా వ్యాపించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

 

ఎప్పడెప్పుడు ఈ సాంగ్‌ని రికార్డ్ చేస్తారా, ఎప్పుడు ఈ సాంగ్ బయటికి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లో ఆడియో విడుదల చేసి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు