అర్చన అవకాశాలు రాకపోవడంతో మేనేజర్లను నిందిస్తోంది

First Published Nov 21, 2017, 10:42 AM IST
Highlights
  • మంచి సినిమా  అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అర్చన వేద
  • రీసెంట్ గా బిగ్ బాస్ షోతో నెగటివో,పాజిటివో గానీబాగా పాపులరైన అర్చన
  • తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి మేనేజర్లే కారణమని నిందలు

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న అర్చన.. బిగ్ బాస్ ఇంట్లో నుండి బయకు వెళ్లిన వారిలో చాలా మంది అర్చన మీద రకరకాల కంప్లయింట్స్ చేసిన విషయం తెలిసిందే. తన యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ తో ప్రతి ఒక్కరిని నొప్పించేలా బిహేవ్ చేసిన అర్చన ముఖ్యంగా దీక్షను మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది.

 

బిగ్ బాస్ ఇంట్లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయి, ఇంట్లో వస పిట్టగా పేరు తెచ్చుకున్న ఆమె తన సినిమాలతో పెద్దగా గుర్తింపు రాకున్నా బిగ్ బాస్ తో కాస్తో కూస్తో ప్రచారం పొందింది. అయితే ఆ షో తర్వాత కూడా  పెద్దగా సినిమా అవకాశాలు అర్చనను పలకరించింది లేదు. అయితే తనకు అవకాశాలు రాకపోవటానికి కారణం తన మేనేజర్లేనని ఆరోపిస్తోంది అర్చన అలియాస్ వేద.

 

‘నా మేనేజర్ల వల్లే నేను ఇబ్బందిపడ్డా. నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు. దీంతో, అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునే వారు. నా ఫోన్ నెంబర్లు అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకునేవారు. పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని. మేనేజర్ల వల్లనే సినిమాల్లో అవకాశాలు రాకుండా నష్టపోయాను. అందుకే కొన్నేళ్లుగా, నాకు మేనేజర్ ఎవరూ లేరు. నేనే డైరెక్టుగా మాట్లాడుకుంటున్నాను' అంది అర్చన.

 

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ప్రపోజ్ చేయలేదని, వాస్తవం చెప్పాలంటే, నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను. ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ, వాళ్ల నిజాయతీ, నిబద్ధత గురించి అనుమానం వచ్చింది. నేను ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది.

 

నిజానికి సరైన ప్లానింగ్ లేకపోవటం, మంచి పాత్రలను చూసుకోకపోవటం వల్లనే వెనుకబడిపోయిందన్నది నిజం. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మేనేజర్లపై నెపం వేస్తే పోయిన అవకాశాలు వస్తాయా. మరి మేనేజర్ లేకుండా చాలా రోజులైంది కదా. ఏవీ మరి.

click me!