ఫస్ట్ టైం చిన్న కూతుర్ని పరిచయం చేసిన పవన్..అచ్చు గుద్దినట్లు ఆ ముగ్గురి పోలికలు, నెటిజన్లకు షాక్

By tirumala AN  |  First Published Oct 2, 2024, 12:53 PM IST

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు పవన్ కాలినడకన వెళ్లారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం పవన్ తిరుమల వెళ్లారు.


జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు పవన్ కాలినడకన వెళ్లారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం పవన్ తిరుమల వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమార్తె ఆధ్య కూడా తిరుమల వెళ్లారు. అయితే ఊహించని సర్ప్రైజ్ చోటు చేసుకుంది. పవన్ తో పాటు ఆయన చిన్న కుమార్తె పలినా అంజని కూడా వెళ్లారు. ఆద్య రేణు దేశాయ్ సంతానం కాగా.. పలినా.. మూడో భార్య అన్నా లెజినోవా సంతానం. 

తొలిసారి చిన్న కూతుర్ని పరిచయం చేసిన పవన్ 

చాలా ఏళ్ళ క్రితం చిన్నతనంలో పలినా కనిపించింది. ఆ తర్వాత మీడియా ముందు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు తిరుమలలో పవన్ కళ్యాణ్, తన సోదరి ఆద్యతో కలసి కనిపించింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలినా అప్పుడే ఇంత పెద్ద అమ్మాయిగా మారారా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. అన్నా లెజినోవా, ఆమె పిల్లలు పలీనా, మార్క్ శంకర్ క్రిస్టియానిటీ పాటిస్తారు. అన్య మతస్థులు తిరుమల వెళ్ళినప్పుడు టిటిడికి డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ విషయంలో ఇటీవల వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టిటిడి నియమాలు గౌరవిస్తూ తన చిన్న కుమార్తె పలినా చేత డిక్లరేషన్ పై సంతకం చేయించారు. ఆమె మైనర్ కాబట్టి తండ్రిగా పవన్ కూడా సంతకం చేశారు. 

Latest Videos

ఆద్య, పలినా ఇద్దరికీ ఎవరి పోలికలో తెలుసా ?  

ఆద్య, పలినా కలసి కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇద్దరి తల్లులు వేరైనప్పటికీ ట్విన్ సిస్టర్స్ లాగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆద్య, పలినా నిజంగానే ట్విన్ సిస్టర్స్ లాగా ఉన్నారు. వీళ్లిద్దరి పోలికలు ఒకే విధంగా ఉండడానికి కారణం ఉంది. అదేంటంటే.. ఆద్యని చూసినప్పుడల్లా ఆమె వాళ్ళ నానమ్మ అంజనా దేవి పోలిక అంటూ కామెంట్స్ వినిపించేవి. పలినాకి కూడా నానమ్మ పోలికలే వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

నానమ్మ పోలికలు మాత్రమే కాకుండా వాళ్ళ మేనత్తలు, చిరంజీవి పవన్ సిస్టర్స్ అయిన విజయ దుర్గ, మాధవి పోలికలు కూడా పవన్ కూతుళ్ళకు వచ్చాయని అంటున్నారు. బహుశా అందుకేనేమో ఆద్య, పలినా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తీన్మార్ చిత్రం సమయంలో అన్నా లెజినోవాతో ప్రేమలో పడ్డారు. రేణు దేశాయ్ తో విడాకులకి ముందే అన్నా లెజినోవా గర్భం దాల్చినట్లు ప్రచారం ఉంది. పవన్, లెజినోవా మొదటి సంతానమే పలినా. రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వీరికి రెండో సంతానంగా మార్క్ శంకర్ జన్మించాడు. 

అన్నా లెజినోవా ఆస్తుల గురించి రూమర్స్ 

1980లో అన్నా లెజినోవా రష్యాలో జన్మించారు. మోడల్ గా, నటిగా రాణించారు. కొన్ని రూమర్స్ ప్రకారం  అన్నా లెజినోవా కేవలం మోడల్ మాత్రమే కాదు. ఎంట్రప్రెన్యూర్ అని కూడా తెలుస్తోంది. రష్యా, సింగపూర్ లలో ఆమెకి భారీ స్థాయిలో హోటల్ వ్యాపారాలు ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ రంగంలో ఆమెకి భారీగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్లు టాక్. దాదాపు 1800 కోట్ల టర్నోవర్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి.  ఏది ఏమైనా అన్నా లెజినోవా మెగా ఫ్యామిలిలో బాగా కలసి పోయింది. ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అన్నా లెజినోవా సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కుమార్తె కూడా వెలుగులోకి వచ్చింది. ఒక వైపు రేణు దేశాయ్ పిల్లలు, మరోవైపు అన్నా లెజినోవా పిల్లలు ఇలా కలసి మెలిసి ఉండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

పవన్ పిల్లలు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ 

ఎన్నికల ఫలితాలు రాగానే అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ ని వీరతిలకం దిద్ది హారతి పట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. పవన్ తో కలసి ఆమె విజయవాడకి కూడా వచ్చారు. చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా అన్నా లెజినోవా పవన్ తో కలసి హాజరైంది. తన భర్త డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ దృశ్యాలని అన్నా లెజినోవా ఫోన్ లో వీడియో తీసుకుంటూ సంబరపడింది. 

Also Read: ఆ ఇంట్లోకి వెళ్ళాక డైరెక్టర్ కి దరిద్రం షురూ..మహేష్ ఓకె చెప్పాడు కానీ, అట్టర్ ఫ్లాప్ పై అసలు విషయం వెలుగులోకి

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పిల్లలు కూడా జాతీయ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తెతో తిరుమలలో డిక్లరేషన్ చేయించారు అనే న్యూస్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. 

click me!