ప్రభాస్‌తోనా వామ్మో చెడిపోవడం కాయం, `సలార్‌` నటుడు షాకింగ్‌ కామెంట్స్, డార్లింగ్‌లో చెత్త విషయం ఏంటంటే?

By Aithagoni Raju  |  First Published Oct 2, 2024, 12:44 PM IST

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కలిసి `సలార్‌`లో స్నేహితులుగా నటించారు. అయితే రియల్ లైఫ్‌లో ప్రభాస్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేశాడు పృథ్వీరాజ్‌. డార్లింగ్‌తో ఉంటే చెడిపోవడం పక్కా అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 


ప్రభాస్‌ ది రాజుల ఫ్యామిలీ. తాను సాయం చేసినా పెద్దగానే ఉంటుంది. భోజనం పెట్టినా పెద్దగానే ఉంటుంది. అయితే నోరూరించే పసందైన వంటకాలతో భోజనం పెట్టడం ప్రభాస్‌ స్పెషాలిటీ. తాను నటిస్తున్న సినిమా యూనిట్‌కి చాలా మందికి చాలా సార్లు ఇలా అనేక రకాల వంటకాలతో భోజనం పెడుతూ వస్తున్నారు డార్లింగ్‌. ఇక తనతోటి కోస్టార్స్ కి అయితే మరీ ప్రత్యేకంగా వంటకాలు చేయించి వడ్డిస్తుంటాడు. కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తుంటాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్ల కోసం ఇక్కడ చూడండి.

Latest Videos

ప్రభాస్‌ భోజనం చేశాక, ఆ విషయాన్ని పంచుకోకుండా ఉండని ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయనతో సినిమా చేసిన ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్లు ఈ విషయాన్ని చెబుతుంటారు. ఎప్పటికీ మర్చిపోలేని భోజనంగా వర్ణిస్తుంటారు. అదే ప్రభాస్‌ ప్రత్యేకత. తాను కూడా చాలా ఫుడ్డీ. ఏదైనా కడుపు కట్టుకోకుండా తీనేస్తుంటాడు. తర్వాత వర్కౌట్స్ చేయడానికి చాలా కష్టపడుతుంటాడని అంటుంటారు. 

ప్రభాస్‌తో పృథ్వీరాజ్‌కి చేదు అనుభవం..

ఈ నేపథ్యంలో ప్రభాస్‌పై `సలార్‌` నటుడు హాట్‌ కామెంట్‌ చేశారు. పృథ్వీరాజ్‌ సుకుమార్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.ప్రభాస్‌లో ఉన్న చెత్త విషయం బయటపెట్టాడు. ఆయనతో `సలార్‌`లో నటించిన అనుభవంతో ఆయన అసలు విషయాన్ని పంచుకున్నాడు. ప్రభాస్‌తో ఉంటే చెడిపోవడం పక్కా అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే అది ఫుడ్‌ కారణంగా అని చెప్పడం విశేషం. ప్రభాస్‌తో ఉంటే ఫుడ్‌ విషయంలో మనం కంట్రోల్‌లో ఉండలేమని, ఆయన కంట్రోల్‌గా ఉండనివ్వరని, విభిన్న రకాల వంటకాలు ముందు పెట్టి కొద్ది కొద్దిగా తినమంటే ఎలా సాధ్యం.

అందుకే ప్రభాస్‌తో ఉంటే చెడిపోవడం పక్కా అని తెలిపారు. డైట్‌ చేయడం చాలా కష్టమని, ఫిట్‌నెస్‌ గోవింద అంటూ కామెంట్‌ చేశాడు పృథ్వీరాజ్‌. ఒకసారి తన ఫ్యామిలీతో కలిసి సెట్‌కి వస్తే సుమారు 20 రకాల వంటకాలున్నాయట. తన 9ఏళ్ల కూతురు వాటిని చూసి ఆశ్చర్యపోయిందట. ఏం తింటావని అడిగితే అన్నీ సెలెక్ట్ చేసుకుందట. ఆ తర్వాత ప్రభాస్‌ని సర్‌ మరో రూమ్‌ ఉందా? ఇవన్నీ దాచి పెట్టుకోవడానికి అడగాల్సి వచ్చిందట. మార్నింగ్‌ లేచాక అడిగాను, ఏంటి సర్‌ మేం అంకుల్స్, ఆంటీలను తీసుకొని సెట్‌ కి వచ్చా అనుకున్నారా? అంత ఫుడ్‌ పంపించారు. మేం ముగ్గురమేకాదా అన్నాడట. ప్రభాస్‌తో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని తెలిపారు పృథ్వీరాజ్‌. 

శృతి హాసన్‌ నా గురించి ఒక్క మాట కూడా అనలేదు..

సో ప్రభాస్‌తో ఉంటే అలా ఉంటుందని తెలిపారు పృథ్వీరాజ్‌. `సలార్‌` సమయంలో రాజమౌళితో జరిగిన చిట్‌ ఛాట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నాడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఈ ఇద్దరు కలిసి నటించిన `సలార్‌` పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీకి యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. సుమారు 750కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది.

ఇందులో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ స్నేహితులుగా నటించారు. స్నేహితుడి కోసం ప్రభాస్‌ ఏంచేశాడనేది `సలార్‌` కథ. ఈ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనేది పార్ట్ 2 కథగా ఉండబోతుంది. అయితే ఇదే ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ, శృతి హాసన్‌ మీ స్కిన్‌ చూసి వాహ్‌ ఇంకా మీరు 20ఏళ్లలా ఉన్నారని ప్రశంసించింది. కానీ నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ కామెంట్ చేశాడు ప్రభాస్‌. దీంతో ఆ ఇంటర్వ్యూలో నవ్వులు విరిశాయి. లేటెస్ట్ గా ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారడం విశేషం. 

ప్రభాస్‌ ఏడాదిలో మూడు పాన్‌ ఇండియా సినిమాలు..

ప్రభాస్‌ పాన్‌ ఇండియా ఇమేజ్‌ని దాటుకుని గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. `కల్కి 2898 ఏడీ` సినిమాతో ఆయన రేంజ్‌ మారిపోయింది. మరో సినిమా గట్టిగా పడితే ఆయన ఇంటర్నేషనల్‌ స్టార్‌గా సెటిల్‌ అయిపోవచ్చు. కానీ ప్రభాస్ నేల విడిచి సాము చేయడం లేదు. ఆయన తనకు లైఫ్‌ ఇచ్చిన, తన సొంత గడ్డపై నుంచే ప్రపంచానికి తానేంటో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వారి సత్తాని అందరికి చూపించాలని నిర్ణయించుకున్నారు.

ఏడాదికి రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కనీసం రెండు సినిమాలైనా ఆయన్నుంచి వస్తుండటం విశేషం. గడిచిన ఏడాదిలోనే డార్లింగ్‌ నుంచి మూడు పాన్‌ ఇండియా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. `ఆదిపురుష్‌`, `సలార్‌`, `కల్కి 2898 ఏడీ` సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. `ఆదిపురుష` డిజప్పాయింట్‌ చేయగా, మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీసుి షేక చేశాయి. 

ప్రభాస్‌ ఐదు భారీ సినిమాల లైనప్‌..

ప్రస్తుతం ఆయన చేతిలో మరో మూడు నాలుగు సినిమాలున్నాయి. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో `ది రాజా సాబ్‌` సినిమా చేస్తున్నారు. ఫస్ట్ టైమ్‌ ప్రభాస్‌ హర్రర్‌ సినిమా చేస్తున్నారు. రొమాంటిక్‌ హార్రర్‌ కామెడీతో రాబోతున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ స్టోరీగా ఉండబోతుందట. ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని సమాచారం.

డార్లింగ్‌ ఇలాంటి సైనికుడి తరహా పాత్రలు చేయడం ఇదే మొదటిసారి. అలాగే సందీప్‌ రెడ్డితో `స్పిరిట్‌` మూవీ చేయాల్సింది. ఇది వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ కనిపిస్తాడట. దీంతోపాటు రెండు పార్ట్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. అవే `సలార్‌ 2`, `కల్కి 2`. ఈ మూవీస్‌ కంప్లీట్‌ అవడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందని చెప్పొచ్చు. ఇవన్నీ భారీ బడ్జెట్‌, భారీ స్కేల్‌ ఉన్న సినిమాలు కావడం విశేషం. 
 

click me!