
పవన్ కళ్యాణ్‌తో సినిమాలో ఛాన్స్ అంటే ఎగిరి గంతేయని వారుండరు. కానీ వచ్చిన ఆఫర్‌ను కాదనేవారుంటారా? కొందరికి ఏమైందో ఏమో కానీ పవర్ స్టార్ మూవీలో ఆఫర్లను కూడా నిరాకరిస్తున్నారు. ఇటీవల రకుల్‌ప్రీత్ సింగ్‌కు ఆఫర్ వచ్చినా.. కాదనేసింది. తాజాగా ఆ జాబితాలోకి మరొకరు చేరిపోయారు.
మాటల రచయిత హర్షవర్దన్ పవన్ సినిమాలో రాసేందుకు వచ్చిన ఆఫర్‌ను వద్దన్నాడట. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం సినిమాలకు మాటలను అందించి తనదైన ఇమేజ్ తెచ్చుకున్న హర్షవర్దన్.. పవర్ స్టార్ సినిమాకు మాత్రం సారీ చెప్పాడట.
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు ఆర్టీ నీశన్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. నీశన్ సినిమా కోసం మాటలు రచించేందుకు హర్షవర్దన్‌ను సంప్రదించగా.. రాయలేనన్నాడట.
అయితే నిరాకరించేందుకు హర్షవర్థన్ కు బలమైన కారణం ఉంది. యాంకర్ శ్రీముఖి, తమిళనటుడు కిశోర్‌లతో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలోనే పవన్ సినిమాకు నో చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అంతేకాదు.. ఆ సినిమా పూర్తికాగానే తన సెకండ్ మూవీని సుధీర్‌బాబుతో ప్లాన్ చేస్తున్నాడట హర్షవర్దన్. అందుకే దర్శకుడిగా నిలదొక్కుకునేందుకు పవన్ సినిమాకు ఆఫర్ వచ్చినా కాదన్నాడట.