అభిమానులను తిట్టడం కరెక్ట్ అనిపించిందన్న నాగబాబు

Published : Feb 08, 2017, 09:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అభిమానులను తిట్టడం కరెక్ట్ అనిపించిందన్న నాగబాబు

సారాంశం

అభిమానులపై చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానన్న నాగబాబు గతంలో పవన్ కళ్యాణ్ అభిమానులపై విరుచుకుపడ్డ మెగా బ్రదర్ 2015వ సంవత్సరంలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానులపై నోరుపారేసుకున్న మెగా బ్రదర్  

మెగా బ్రదర్ నాగబాబు కొంచెం ఆలస్యంగా స్పందించాడు. తాను గతంలో అభిమానులపై గతంలో చేసిన దుందుడుకు వ్యాఖ్యల పట్ల ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాడు. 2015లో మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తాను తిట్టిపోయడంపై ఇప్పుడు చింతిస్తున్నాడు. పవన్ అభిమానులు శ్రుతిమించారని నాగబాబు అంటున్నా... తను వాళ్ల మీద అప్పుడు ఆ స్థాయిలో విరుచుకుపడాల్సింది కాదని నాగబాబు అభిప్రాయపడ్డాడు. 



పవన్ కల్యాణ్ అభిమానులంటే మెగా అభిమానులేనని.. పవన్ ఎదుగుదలకు వారంతా పిల్లర్ల లాగా ఉపయోగపడ్డారని నాగబాబు అన్నాడు. ఐతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్లలో వారు చేసే గోల శ్రుతి మించిపోయిందని.. అదీ కాక తమ ఫ్యామిలీ హీరోల కార్యక్రమాల్లోనే కాకుండా ఇతర హీరోల ఫంక్షన్లలోనూ వారు చేసే అల్లరి వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయని నాగబాబు అన్నాడు. ఐతే ఒక హీరోపై నిజమైన ప్రేమను చూపించేది అభిమానులేనని.. కాబట్టి న్యూసెన్స్ చేశారని అభిమానులపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినందుకు చింతిస్తున్నానని నాగబాబు చెప్పాడు. ఐతే ఆ సమయంలో తనకు అదే కరెక్ట్ అనిపించిందని, అందుకే అభిమానుల్ని తిట్టానని నాగబాబు స్పష్టం చేశాడు.



2015లో చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుంటే నాగబాబు కోపం పట్టలేకపోయాడు. పవన్ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకు రావట్లేదో అతడి ఇంటి ముందుకు వెళ్లి అడగాలని.. అంతే తప్ప ఇక్కడ వచ్చి గొడవ చేయడం సంస్కారం కాదని నాగబాబు తీవ్ర స్వరంతో అభిమానులపై మండి పడ్డాడు.

PREV
click me!

Recommended Stories

Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి