యూత్‌స్టార్‌ నితిన్‌తో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో కె.కె.రాధామోహన్‌ భారీ చిత్రం

Published : Feb 08, 2017, 10:14 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
యూత్‌స్టార్‌ నితిన్‌తో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో కె.కె.రాధామోహన్‌ భారీ చిత్రం

సారాంశం

కేకే రాధామోహన్ నిర్మాతగా నితిన్ హీరోగా మరో మూవీ ఆగస్ట్ తర్వాత కొత్త చిత్రం ట్రాక్ లోకు వచ్చే అవకాశం

ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మరో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. 

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ''నితిన్‌తో ఓ సూపర్‌హిట్‌ చిత్రం తియ్యాలన్న ఉద్దేశంతో సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నితిన్‌... హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణచైతన్య డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం ఆగస్ట్‌ తర్వాత మా చిత్రం ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము'' అన్నారు. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు