
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల `వకీల్‌సాబ్`తో రీఎంట్రి ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌తో కమ్‌బ్యాక్ అదిరిపోయింది. ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌తోపాటు క్రిష్‌తో `హరిహర వీరమల్లు` చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోయాయి. ఆ తర్వాత చాలా ఇతర సినిమాలు షూటింగ్‌లు రీస్టార్ట్ అయి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాడనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెరదించారు. సోమవారం నుంచి పవన్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో పవన్ పాల్గొంటున్నారట. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సెట్‌లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఓ ఫోటోని పంచుకుంటూ దాన్ని వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు చిత్ర బృందం కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. భీమ్లా నాయక్ డ్యూటీలో చేరారని తెలియజేస్తూ పోలీస్ డ్రెస్‌లో ఉన్న పవన్ ఫోటోని పంచుకున్నారు. ఇందులో పవన్ మరోసారి పోలీస్‌గా కనిపించబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నుంచే అభిమానులు `పీఎస్‌పీకేరానామూవీ` ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నరు. ఇక ఈచిత్రంలో రానా మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు.