మహేష్‌, త్రివిక్రమ్‌, త్రిష.. `అతడు` మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

Published : Jul 26, 2021, 11:18 AM IST
మహేష్‌, త్రివిక్రమ్‌, త్రిష.. `అతడు` మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?

సారాంశం

చాలా గ్యాప్‌తో మరోసారి మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరోసారి `అతడు` మ్యాజిక్‌ని రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట.

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం `అతడు`. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యావరేజ్‌గానే ఆడింది. కానీ టీవీలో మాత్రం అత్యధిక రేటింగ్‌ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా మంచి రేటింగ్‌ వస్తుంటుంది. అంతేకాదు అత్యధికసార్లు టీవీ ప్రసారమైన సినిమానూ రికార్డ్ సృష్టించింది. త్రివిక్రమ్‌ సినిమాలు హంగూ ఆర్భాటాలకు అతీతంగా ఎప్పుడూ చూసిన ఓ ఫ్రెష్‌ ఫీలింగ్‌ ని ఇస్తుంటాయి. అందుకే ఆయా చిత్రాలకు టీవీలోనూ మంచి ఆదరణ లభిస్తుంది. అందుకు ఉదాహరణే `అతడు`. 

ఆ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `ఖలేజా` వచ్చింది. కానీ ఇది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చాలా గ్యాప్‌తో మరోసారి మహేష్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరోసారి `అతడు` మ్యాజిక్‌ని రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. ఇందులో హీరోయిన్‌గా త్రిషని తీసుకునే ఆలోచనలో మాటల మాంత్రికుడు ఉన్నారని సమాచారం. అయితే హీరోయిన్‌ పాత్ర కోసం చాలా మంది స్టార్‌ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. 

పూజా హెగ్డే, కియారా, జాన్వీ, మాళవిక మోహనన్‌ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లందరిని పక్కన పెట్టి త్రిష వైపు మొగ్గు చూపుతున్నారని త్రివిక్రమ్‌. ఆల్మోస్ట్  కన్ఫమ్‌ అనే టాక్‌ వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకి చోటు ఉందని, మరో కథానాయికగా నివేదా థామస్‌ని తీసుకోబోతున్నారని టాక్‌. ప్రస్తుతం త్రిష `పొన్నియిన్‌ సెల్వన్‌`, `గర్జణై`,`సతురంగ వెట్టై 2`, `రాంగి`, `రామ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు కన్నడలో పునిత్‌ రాజ్‌కుమార్‌తో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. `యూటర్న్` ఫేమ్‌ పవన్‌ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి