బాలయ్యను సమస్యలలోకి నెట్టిన పవన్.. వెయ్యికోట్ల బిసినెస్ తలపట్టుకుంటున్న నిర్మాతలు!

By team teluguFirst Published Oct 1, 2021, 10:07 AM IST
Highlights

సినిమా సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని పవన్ తన స్పీచ్ తో రెచ్చగొట్టారని చిత్ర ప్రముఖులు సైతం భావిస్తున్నారు. పవన్ కారణంగా ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అఖండ చిత్రం కోసం. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరున్న బాలయ్య-బోయపాటి శ్రీను నుండి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ ఏడాది సమ్మర్ కానుకగా అఖండ విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక అఖండ షూటింగ్ చకచకా పూర్తి చేసిన బాలయ్య, విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 


అయితే దసరా కానుకగా విడుదల చేయాలని మొదట భావించారు. అది కుదరకపోవడంతో దీపావళి పండుగకు అఖండ విడుదల చేయాలని గట్టిగా అనుకుంటున్నారు. కాగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం రాజకీయంగా దుమారం రేపింది. సినిమా పరిశ్రమకు చేటు కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


సినిమా సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని పవన్ తన స్పీచ్ తో రెచ్చగొట్టారని చిత్ర ప్రముఖులు సైతం భావిస్తున్నారు. పవన్ కారణంగా ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఇంకా యాభై శాతం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్స్ నడుపుతున్నారు. అలాగే టికెట్స్ ధరలపై పునరాలోచన చేయాలని, ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. 


రాజకీయ వివాదం కారణంగా ప్రభుత్వ చర్యలకు ఆటంకం ఏర్పడింది. కనీసం దీపావళి సమయానికైనా థియేటర్స్ ని పూర్తి సీటింగ్ కెపాసిటీతో, రివైజ్డ్ ధరలతో నడుపుతారనే గ్యారంటీ లేదు. ఈ కారణంగా అఖండ యూనిట్ మూవీ ప్రకటన తేదీ వెల్లడించడం లేదని సమాచారం. ఈ విషయం ఓ కొలిక్కి వస్తే సినిమా విడుదల చేయాలని అఖండ యూనిట్ భావిస్తున్నారు. 


రానున్న నాలుగు నెలల కాలంలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా సినిమా బిజినెస్ జరగనుంది. పుష్ప, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్ ఇలా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పొలిటికల్ కాంట్రవర్సీలోకి చిత్ర పరిశ్రమను లాగడం నిర్మాతలను భయపెడుతుంది. 

click me!