
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత అతని ప్రేయసి రియా చక్రవర్తి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. సుశాంత్ మరణానికి కారణం రియానే అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. సుశాంత్ డెత్ ఇన్వెస్టిగేషన్ కాస్తా, డ్రగ్ కేసుగా మలుపు తీసుకోవడం జరిగింది. డ్రగ్ ఫెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై రియా చక్రవర్తి జైలుపాలయ్యారు.
ఆ తరువాత ఆమెపై వచ్చిన అనేక ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని తేలింది. నెలల తరబడి రియా చక్రవర్తి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. రియా జీవితంలో ఇంత కాంట్రవర్సీ ఉన్న తరుణంలో ఆమెను బిగ్ బాస్ షోకి తీసుకోవడం ద్వారా భారీ టీఆర్పీ రాబట్టవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా సీజన్ 15 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కొరకు రియా చక్రవర్తిని యాజమాన్యం సంప్రదించారట. అలాగే ఆమెకు వారానికి రూ. 35 లక్షలు, అనగా రోజుకు రూ. 5 లక్షలు ఆఫర్ చేశారట. అయినా షోకి రావడానికి రియా నిరాకరించారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. సుశాంత్ మరణం తరువాత రియా జీవితం తలక్రిందులు కాగా, ఆమెకు అవకాశాలు ఎవ్వరూ ఇవ్వడం లేదు.