మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ట్రైలర్ : ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’..

Surya Prakash   | Asianet News
Published : Sep 30, 2021, 07:52 PM ISTUpdated : Sep 30, 2021, 07:53 PM IST
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ట్రైలర్ : ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’..

సారాంశం

అఖిల్‌ హీరోగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ ట్రైలర్‌ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే హీరోయిన్. కొవిడ్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. 


అఖిల్‌ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే హీరోయిన్.  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.  కొవిడ్‌ కారణంగా విడుదల వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్  ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్‌, ఫన్ తో రూపొందిన ఈ ట్రైలర్‌ ఇంట్రస్టింగ్ గా సాగింది. అఖిల్‌, పూజా హెగ్డే మధ్య వచ్చే డైలాగులు బాగున్నాయి. మీరూ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

‘మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని ఎదురుచూస్తున్న పూజా డైలాగుతో మొదలైంది. ‘ఓ అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్‌, 50 శాతం పెళ్లిజీవితం. మ్యారీడ్‌ లైఫ్‌ బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలి’ అనేది అఖిల్‌ చెప్తూంటాడు. ఇలా ఎంతో ప్రేమగా ఉండే ఇద్దరి మధ్య విబేధాలు  తలెత్తుతాయి.

‘నీకు పెళ్లి గురించి ఏం తెలియదు. అసలు నీకు గురించి నీకే తెలియదు’ అని అఖిల్‌ని ఉద్దేశించి పూజ అంటుంది.   ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను’ అని అఖిల్‌ చెప్పిన తీరు మెప్పిస్తోంది. ‘లోకం సర్దుకుపొమ్మంటుంది, మందని వదలి.. కొత్తదారి వెతికి. నేను వెళ్తున్నా, మీరూ రండి’ అనే డైలాగుతో ట్రైలర్‌ ముగుస్తుంది.

 
ప్రేమ, కుటుంబకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజాహెగ్డే నటించారు. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ. 
  

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?