Sharwanand: ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా నుంచి టీజర్ రిలీజ్.. ఈసారైనా శర్వానంద్ కు వర్కౌట్ అయ్యేనా..?

Published : Feb 10, 2022, 10:27 PM ISTUpdated : Feb 10, 2022, 10:31 PM IST
Sharwanand: ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా నుంచి టీజర్ రిలీజ్.. ఈసారైనా శర్వానంద్ కు వర్కౌట్ అయ్యేనా..?

సారాంశం

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand). సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నా.. ఏమాత్రం నిరాశ పడకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు.

వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand). సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నా.. ఏమాత్రం నిరాశ పడకుండా ట్రై చేస్తూనే ఉన్నాడు.

శర్వానంద్(Sharwanand).  కి ఇటు యూత్ లోను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను మంచి క్రేజ్ ఉంది. కాని ఎందుకో ఈయంగ్ స్టార్ కు కాలం కలిసిరావడంలేదు. అందుకే వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అటు యూత్ కు ఇటు ప్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే కథలనే ఆయన ఎక్కువగా ఎంచుకుంటూ వెళుతున్నాడు.

ప్రస్తుతం శర్వానంద్ (Sharwanand).  కిశోర్ తిరుమల డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు టీమ్. చూస్తుండగానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈమూవీలో శర్వానంద్(Sharwanand).  జోడీగా స్టాన్ హీరోయిన్ రష్మిక మందన్న నటించింది. వీరితో పాటు ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రాధిక, ఊర్వశీ, ఖుష్భులు కూడా ఈమూవీలో సందడి చేశారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించారు. ఇక ఈ సినిమాపై హైప్ పెరిగేలా టీజర్ ను రిలజ్ చేశారు టీమ్. ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఒక్క సారి టీజర్ ను చూస్తే.. హీరో చాలా మంది అమ్మాయిలను  పెళ్లి చూపులు చూస్తాడు. అయినా ఎవరూ నచ్చరు. అయితే శర్వానంద్ చేసిన లేట్ వల్ల  ఆయన నచ్చేలేదని చెప్పే అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ కామెడీ లైన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నట్టు తెలుస్తోంది.


ఇక ఎవరు సెట్ అవ్వక చివరిసారిగా హీరో..హీరోయిన్ పైనే ఆశలు పెట్టుకుంటాడు. కానీ ఆమె కూడా ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడనేది కథ. ఈ టీజర్ తో సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ పరిగిపోయింది ఆడియన్స్ లో.  ఈ నెల 25న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాను థియోటర్లలో రిలీజ్ చేయబోతున్నారు టీమ్.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం