పవన్‌ కళ్యాణ్‌-క్రిష్‌ చిత్రంః లీకైన పవర్‌ స్టార్‌ గెటప్‌..ఫోటో వైరల్‌

Published : Feb 26, 2021, 02:22 PM IST
పవన్‌ కళ్యాణ్‌-క్రిష్‌ చిత్రంః లీకైన పవర్‌ స్టార్‌ గెటప్‌..ఫోటో వైరల్‌

సారాంశం

`పీఎస్‌పీకే27` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులోని పవన్‌ లుక్‌ లీకైంది.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. `పీఎస్‌పీకే27` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి `హరహర మహదేవ` అనే టైటిల్‌ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి పవన్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. 

సెట్లో పవన్‌ నడుచుకుంటూ వస్తున్న లుక్‌ ఇది.  జానపద తరహా దుస్తులుధరించారు. పీరియాడికల్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. బందిపోటు రాబిన్‌ హుడ్‌ పాత్ర తరహాలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. పీరియాడికల్‌ లుక్‌ కోసం ఇలా పవన్‌ ముస్తాబైనట్టు తెలుస్తుంది. పవన్‌ లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. బందిపోటుని పోలినట్టుగా ఆయన గెటప్‌ ఉండటం విశేషం. కథపై, ఆయన పాత్రపై మరింత క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. తాజాగా దీన్ని పవన్‌ అభిమానులు తెగ వైరల్‌ చేస్తున్నారు. ఆయన లుక్‌ని చూసి ఖుషీ అవుతూ, లైక్‌లు, షేర్లలతో ట్రెండ్‌ చేస్తున్నారు. 

ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయబోతున్నారు. ఇందులో నిధితోపాటు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ మరో హీరోయిన్‌గా నటించనుందట. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దీంతోపాటు పవన్‌ మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో రానా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజ వల్ల ఇంట్లో 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టి భార్య.. దూరంగా ఉండమని చెప్పి, ఏం జరిగిందంటే
Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?