ఆస్కార్‌ బరిలో సూర్య `ఆకాశమే నీ హద్దురా`..మూడు విభాగాల్లో..

Published : Feb 26, 2021, 12:45 PM IST
ఆస్కార్‌ బరిలో సూర్య `ఆకాశమే నీ హద్దురా`..మూడు విభాగాల్లో..

సారాంశం

చాలా ఏళ్ల తర్వాత ఆస్కార్‌  అవార్డు పోటీలో ఇండియన్‌ సినిమాలు నిలిచింది. తాజాగా సూర్య హీరోగా నటించిన `ఆకాశమే నీ హద్దురా'(సూరారై పోట్రు) చిత్రం అకాడమీ అవార్డ్ బరిలో నిలిచింది. విదేశీ విభాగంలో ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళీ ఆస్కార్‌ నామినేషన్స్ కి ఎంపికయ్యారు. 

చాలా ఏళ్ల తర్వాత ఆస్కార్‌  అవార్డు పోటీలో ఇండియన్‌ సినిమాలు నిలిచింది. తాజాగా సూర్య హీరోగా నటించిన `ఆకాశమే నీ హద్దురా'(సూరారై పోట్రు) చిత్రం అకాడమీ అవార్డ్ బరిలో నిలిచింది. విదేశీ విభాగంలో ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళీ ఆస్కార్‌ నామినేషన్స్ కి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 

సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందగా, సూర్య, అపర్ణ బాలమురళీ జంటగా నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య ఈ సినిమాని నిర్మించారు. ఇటీవల ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. థియేటర్లు ఓపెన్‌ అయ్యాక థియేటర్లలోనూ రిలీజ్‌ అయి ఆకట్టుకుంటుంది. ఎయిర్‌ దక్కన్‌ అధినేన గోపీనాథ్‌ జీవితం ఆధారంగా, ఆయన తక్కువ ధరకే విమాన టికెట్టుని ప్రవేశ పెట్టి దేశంలోనే సంచలనం సృష్టించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదిలా ఉంటే ఆస్కార్‌ నామినేషన్‌కి పంపిన `జల్లికట్టు` చిత్రం నామినేషన్స్ కి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా