నితిన్‌ వీపుపైకి ఎగరబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌

Published : Feb 26, 2021, 01:16 PM IST
నితిన్‌ వీపుపైకి ఎగరబోయి కింద పడిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌

సారాంశం

ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది. కలల రాణిలా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్‌ సరసన `చెక్‌` చిత్రంలో నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఓ వీడియోని షేర్‌ చేసుకుంది. 

ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. ఈ అమ్మడు తెలియని సోషల్‌ మీడియా అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. తొలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. ఒక కన్నుగీటుతోనే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకుంది. కలల రాణిలా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్‌ సరసన `చెక్‌` చిత్రంలో నటించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఓ వీడియోని షేర్‌ చేసుకుంది. 

ఇందులో ప్రియా ప్రకాష్‌ వారియన్‌ నితిన్‌పైకి ఎక్కే క్రమంలో జారి కింద పడిపోయింది. `చెక్‌` చిత్ర షూటింగ్‌లో ఓ పాత కోటలో నితిన్‌, ప్రియా మధ్య లవ్‌ ఎపిసోడ్‌ సాగుతుంది. ఇందులో ప్రియా పరుగెత్తుకుంటూ వచ్చి వెనకాల నుంచి నితిన్‌ వీపు పైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ సరిగా ఎగరలేక ప్రియా వెల్లకిలా కింద పడిపోయింది. ఫన్నీగా ఉన్న ఈ సీన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ వీడియోని పంచుకుంటూ, `జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను నమ్మకంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నాననే విషయాన్ని ప్రతిబింబిస్తుంది` అని పేర్కొంది ప్రియా. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా