మరోసారి పెరిగిన పవన్ రెమ్యునేషన్, ఎంతంటే

Surya Prakash   | Asianet News
Published : Sep 08, 2021, 12:09 PM IST
మరోసారి పెరిగిన పవన్ రెమ్యునేషన్, ఎంతంటే

సారాంశం

పవన్ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్, మేనరిజంకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సెలబ్రెటీలు, స్టార్ హీరోలు సైతం పవన్ ని అభిమానిస్తుంటారు. భాష, ప్రాంత బేధాలు లేకుండా పవన్ కి ఫ్యాన్స్ ఉంటారు. 

సౌత్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు.పవన్  నటించిన సినిమాలు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో సైతం విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. పవన్ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్, మేనరిజంకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సెలబ్రెటీలు, స్టార్ హీరోలు సైతం పవన్ ని అభిమానిస్తుంటారు. భాష, ప్రాంత బేధాలు లేకుండా పవన్ కి ఫ్యాన్స్ ఉంటారు. అంతెందుకు రీసెంట్ గా ఆయన ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీ లో ప్రస్తావనకు వచ్చింది. తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.  డిఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ని ప్రస్తావించారు. 

రీసెంట్ గా  టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అయ్యి మరి డైలాగ్స్ దంచి కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హరీష్ శంకర్ రాసిన గబ్బర్ సింగ్ డైలాగ్ ని సెహ్వాగ్ చెప్పిన తీరుకి ఫిదా అయిపోతున్నారు నెటిజన్స్.  ఈ వీడియోని షేర్ చేస్తూ.. తమ అభిమాన హీరో క్రేజ్ ని దేశవ్యాప్తంగా మారుమ్రోగిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ స్దాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరో మరొకరు లేరు. అందుకే ఆయనకు రెమ్యునేషన్ ఆ స్దాయిలో పెంచుకుంటూ పోతున్నారు నిర్మాతలు.

‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో ఆయన 30 కోట్లవరకూ రెమ్యునేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన ఎంత తీసుకుని ఉంటారనేది అందరిలో తలెత్తే ప్రశ్న. ఈ సినిమాకి గాను ఆయన పారితోషికంగా 45 నుంచి 50 కోట్ల వరకూ తీసుకున్నారని  అన్నారు. ఇప్పుడు మరోసారి రెమ్యునేషన్ పెంచారని టాక్. ఈ నేపధ్యంలో  ప్రస్తుతం పవన్ రెమ్యునరేషన్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమా కోసం 65 కోట్లు దాకా తీసుకుంటున్నాడని వినిపిస్తోంది. డిజిటల్,శాటిలైట్,యూట్యూబ్, ఇతర భాషల రైట్స్ పెరిగిన నేపధ్యంలో ఈ రెమ్యునేషన్ సమంజసమైనదనే భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విషయం తెలిసిందే. హరహర వీరమల్లు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తోపాటు  రానా తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు పవన్. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు చేస్తున్నాడు  పవర్ స్టార్.

PREV
click me!

Recommended Stories

Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం
2025 లో రియల్ లైఫ్ స్టోరీలతో వచ్చిన 6 సినిమాలు.. కొన్ని హిట్లు, కొన్ని వివాదాలు