భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్

By team teluguFirst Published Sep 8, 2021, 11:48 AM IST
Highlights

నటసింహం బాలయ్య అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలు ఇంగ్లాడ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారాయి. 
 

అభిమానానికి హద్దులు లేవు. స్టార్ కోసం ఫ్యాన్స్ చేసే పనులు తరచుగా వార్తలకు ఎక్కుతూ ఉంటాయి. తాజాగా నటసింహం బాలయ్య అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలు ఇంగ్లాడ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా నిర్వహించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారాయి. జూన్ 10న బాలకృష్ణ 61వ బర్త్ డే జరుపుకున్నారు. కాగా సెప్టెంబర్ 6 బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు నేపథ్యంలో ఫ్యాన్స్, ఘనంగా వేడుకలు నిర్వహించారు. 

భారత్, ఇంగ్లాడ్ మధ్య ఓవల్ వేదికగా నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓటమిని తప్పించుకున్న భారత్ అనూహ్యంగా విజయాన్ని అందుకుంది. 157 పరుగులతో ఇంగ్లాండ్ ని ఓడించి ఐదు మ్యాచ్ ల సిరీస్ 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. కాగా ఈ వేదిక సాక్షిగా బాలయ్య అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. బాలయ్య ఫొటోతో పాటు, టీడీపీ జెండాలు కూడా ఎగరవేశారు. 

బాలయ్య బర్త్ డే ఫొటోలో జూనియర్, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కూడా గమనించవచ్చు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఫోటోలు బాలయ్యతో బర్త్ డే ఫొటోలో లేకపోవడం గమనార్హం. టీడీపీలో లోకేష్, ఎన్టీఆర్ అనే రెండు వర్గాలు ఏర్పడగా, ఇదొక ఉదాహరణ చెప్పవచ్చు. 

మరోవైపు అఖండ మూవీ షూటింగ్ పూర్తి చేశారు బాలయ్య, బోయపాటి. దసరా కానుకగా అఖండ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మాతగా ఉన్నారు. 
 

Celebrations Snaps at Oval cricket ground during 4th test match🔥 🥁 pic.twitter.com/qxIfZvtKZS

— manabalayya.com (@manabalayya)
click me!