తమిళ సినిమాలతో బిజీగా సునిల్, తెలుగు స్టార్ కమెడియన్ కు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు

Published : Feb 11, 2023, 06:39 PM IST
తమిళ సినిమాలతో బిజీగా సునిల్, తెలుగు స్టార్ కమెడియన్  కు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు

సారాంశం

కోలీవుడ్ లో వరుస ఆఫర్లు సాధిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ కమెడయిన్ సునిల్. కాస్త లేట్ అయినా.. ఇతర భాషల్లో డిఫరెంట్ రోల్స్ ను దక్కించుకుంటున్నాడు. అటు బాలీవుడ్ నుంచి కూడా సునిల్ కు కాల్స్ వస్తున్నాయట.   అయితే ఇక్కడ స్టార్ కమెడియన్ అయితే.. కోలీవుడ్ లో విలన్ అవతారం ఎత్తాడు సునిల్.

టాలీవుడ్ లో కమెడియన్.. గా స్టార్ డమ్ సాధించి.. హీరోగా కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు సునిల్. అయితే ఈమధ్య కెరీర్ ను కాస్త డిఫరెంట్ గా తీసుకెళ్తున్నాడు సునీల్.  రొటీన్ ను భిన్నంగా పాత్రలను ఎంచుకుంటూ.. వెళ్తున్నాడు. ఈక్రమంలో టాలీవుడ్ ను మాత్రమే నమ్ముకోకుండా.. తమిళ పరిళ్రమతో పాటు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నాడు సునిల్. ముఖ్యంగా కోలీవుడ్ లో.. విలన్ అవతారం ఎత్తాడు సునిల్.  టాలీవుడ్ లో విలన్ గా బాగా వర్కౌట్ అయినట్టుంది.. అక్కడ కూడా అదే పనిలో ఉన్నాడు. 

 అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. సునిల్ టాలీవుడ్ లో కాదు.. కోలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు. అది కూడా కమెడియన్ గా కాదు నెగెటీవ్ రోల్స్ కోసం సునిల్ ను అడుగున్నారు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నెగెటీవ్‌ రోల్‌ చేసి..తనలోని వేరియేషన్స్ తో ఆడియన్స్ మెప్పు పొందాడు సునిల్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి ఇమేజ్ సాధించిందో తెలిసిందే..  సునీల్‌కు సౌత్ లో భారీగా క్రేజ్ కూడా ఈ సినిమాతోనే వచ్చింది. అన్నిభాషల నుంచి సునిల్ కు మంచి మంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు సునిల్. 

ఈరెండు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మరో భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడట సునిల్. గతంలో కంటే కూడా ఇంకా బిజీ అయిపోయాడు సునిల్. రెండు మూడు భాషల్లో.. బిజీగా ఉన్నాడు. తన కెరీర్ గురించి ఇతర భాషల్లో అవకాశాల గురించి రీసెంట్ గా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడారు సునీల్.  నాకు తెలిసి సిక్స్ ప్యాక్ చేయడం కంటే నవ్వించడమే కష్టం..  ఎందుకంటే ఇదివరకు కంటే ఇప్పుడు కామెడీ ఎక్కువగా జనాలకు అందుబాటులో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కామెడీని  జనాలు చూస్తున్నారు.  అందుకే ఆడియన్స్ ను కామెడీతో మెప్పించడానికి ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది అన్నారు. 

ఇక ఇప్పుడు తాను కొన్ని పాత్రకే పరిమితం కాదలుచుకోలేదంటున్నాడు సునిల్. మూసధోరణికి చెక్ పెట్టి.. కొత్తదనం ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను అన్నారు.  ప్రస్తుతం తెలుగులో శంకర్ - చరణ్ కాంబినేషన్లోని సినిమాలోను, పుష్ప 2 లోను ..విరూపాక్ష లోను .. అలాగే కమిటైన సినిమాలు మరికొన్ని ఉన్నాయి" అన్నాడు. ఇక తమిళంలో రజనీకాంత్  జైలర్ .. కార్తి జపాన్ ..  శివకార్తికేయన్ సినిమాలోను .. విశాల్ సినిమాలోను చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి" అంటూ చెప్పుకొచ్చాడు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?