మళ్ళీ ఆ తప్పు చేయను...  అవన్నీ పుకార్లే!

By team teluguFirst Published May 24, 2021, 7:58 PM IST
Highlights

పాయల్ ఓ స్టార్ హీరో మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటూ వార్తలు రావడం జరిగింది. ఈ కథనాలు పాయల్ దృష్టికి వెళ్లగా ఆమె స్పష్టత ఇచ్చారు. 

టాలీవుడ్ హాట్ బాంబ్ పాయల్ రాజ్ ఫుత్ కి అదృష్టం ఆమడదూరంలో ఉంటుంది. మంచి అందం, అభినయం ఉండి కూడా ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. పాయల్ నటించిన సినిమాల్లో చాలా వరకు విజయం సాధించకపోవడం ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపించింది. కనీసం టూ టైర్ హీరోల పక్కన కూడా ఆమెకు అవకాశాలు దక్కకపోవడం బాధాకరం. దాదాపు టాలీవుడ్ నుండి చెక్కేసే పరిస్థితికి చేరింది పాయల్ కెరీర్. 


ఇక ఏంజెల్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఆమె. కామెడీ హారర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ విజయం సాధిస్తే కనీసం కోలీవుడ్ లో నిలదొక్కుకోవచ్చని పాయల్ ఆలోచన. హాట్ ఫిగర్ ఉంటే తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్ట్టుకుంటారు. పాయల్ ఏమాత్రం తమిళ దర్శక నిర్మాతల దృష్టిలో పడినా ఆమె ఫేట్ మారినట్లే. కాగా పాయల్ రాజ్ పుత్ తనపై వస్తున్న ఓ పుకారుకు చెక్ పెట్టింది. 

పాయల్ నాగార్జున నెక్స్ట్ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటూ వార్తలు రావడం జరిగింది. ఈ కథనాలు పాయల్ దృష్టికి వెళ్లగా ఆమె స్పష్టత ఇచ్చారు. ఓ స్పెషల్ సాంగ్ లో నేను నటిస్తున్నానని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆమె చెప్పారు. మరోసారి ఆ తప్పు చేయనని కూడా ఆమె అభిప్రాయపడ్డట్లు సమాచారం. దర్శకుడు తేజా తెరకెక్కించిన సీత మూవీలో పాయల్ 'బుల్ రెడ్డి...' అనే సాంగ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా స్టెప్స్ వేశారు.

Posting just to make clear I’m not going to be part of any song .
Thanks 🙏🏻 pic.twitter.com/n2kysTV6J0

— paayal rajput (@starlingpayal)
click me!