Gudumba Shankar 4K : పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : Aug 18, 2023, 02:56 PM IST
Gudumba Shankar 4K : పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ‘గుడుంబా శంకర్’  సినిమాను మేకర్స్ రీరిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకునే రోజు రాబోతోంది.  పవన్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ‘గుడుంబా శంకర్‘ (Gudumba Shankar)  మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పక్కా తేదీని ప్రకటిస్తూ అనౌస్స్ మెంట్ అందించారు. 

తాజాగా అందించిన అప్డేట్ ప్రకారం.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉండటంతో రెండ్రోజుల ముందుగా అంటే.. ఆగస్టు 31న ‘గుడుంబా శంకర్’ ను రీరిలీజ్ చేస్తున్నారు. Gudumba Shankar 4k వెర్షన్ ను కూడా రెడీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇఫ్పటికే గుడుంబా శంకర్ మేనియా ‘బ్రో’ చిత్రంతో అభిమానులు, ప్రేక్షకులకు తాకినా విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ ఊపూపిన విషయం తెలిసిందే. 

ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్ కళ్యాణ్ ‘కిల్లి కిల్లి’ సాంగ్ కు స్టెప్పులేయడం.. వెండితెరపై పవన్ ను ఫుల్ జోష్ గా చూడటంతో ఫ్యాన్స్  మళ్లీ ‘గుడుంబా శంకర్’ను కోరుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. సినిమాను విజయవంతం చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. ఇక రేపు సాయంత్రం రీరిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

గుడుంబా శంకర్ సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వీర శంకర్ తెరకెక్కించారు. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. కానీ పవన్ యాటిట్యూడ్, స్టైల్ కి ఫ్యాన్స్  ఫిదా అయ్యారు. ఆడియెన్స్ కు కూడా భలే కిక్కిచ్చేలా ఉండటంతో సినిమా ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు మణిశర్మ అందించిన సంగీతం మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంది. ఇక పవన్ ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హర వీరమల్లు’ లాంటి చిత్రాల్లో నటిస్తున్నవిషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే