పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన మూడవ భార్య అయిన 'అన్నాలెజినోవా'తో వుంటున్నారు. ఈ దంపతులకి 'పొలెనా' అనే కూతురు వుంది. అన్నాలెజినోవా మళ్లీ గర్భం ధరించిందనేది తాజా సమాచారం. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది.
ప్రతి రోజు పవన్ కల్యాణ్ షూటింగ్ పూర్తి కాగానే నేరుగా ఇంటికి వెళుతున్నారనీ, గర్భవతి అయిన తన భార్యను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
పవన్ మొదటి భార్యకు విడాకులిచ్చిన తర్వాత రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్, పవన్ కి కలిపి ఇద్దరు పిల్లలు వున్నారు. అయితే తప్పని పరిస్థితుల్లో రేణు దేశాయ్ నుంచి పవన్ విడాకులు తీసుకున్నప్పటికీ, వాళ్లతో ఆయన చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉంటారు. పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త నిజమే అయితే, అది ఆయన అభిమానులకి మరింత ఆనందాన్ని కలిగించేదే.
మరి ఈసారి పవన్ఈ, లెజినోవా దంపతులకు పండంటి తెల్లజాతి బిడ్డ పుడతాడా లేక పండంటి భారత జాతి బిడ్డ పుడతాడా అనేది మాత్రం సస్పెన్స్. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు పవర్ స్టార్ అండ్ లెజినోవా.
