జూన్ 1న విడుదలకానున్న "అమీ తుమీ"

Published : May 08, 2017, 02:26 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
జూన్ 1న విడుదలకానున్న "అమీ తుమీ"

సారాంశం

అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో "అమీ తుమీ" పాటలన్నిట్నీ ఆన్ లైన్ లోనే విడుదల చేసి తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ ఇప్పటికే అమీ తుమీ టీజర్ కు విశేషమైన స్పందన

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ". వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకొన్నాయి. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "విడుదల చేసిన టీజర్ కు విశేషమైన స్పందన లభించింది. అలాగే మే 10న మా సినిమాలోని మొదటి పాట "అయ్యా బాబోయ్" విడుదల కానుంది. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం. జూన్ 1న విడుదలకు సిద్ధమవుతున్న మా "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంది. పాటలన్నిట్నీ ఆన్ లైన్ లోనే విడుదల చేసి.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాం" అన్నారు.  

అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..