కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకి చెక్కుని అందజేసిన పవన్‌

Published : Sep 05, 2021, 05:47 PM IST
కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్యకి చెక్కుని అందజేసిన పవన్‌

సారాంశం

దర్శనం మొగులయ్య పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో ఇంట్రోని ఆలపించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్‌ గురించి ఆయన ఇచ్చిన సాంగ్‌ ఇంట్రడక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్య కి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్  రూ.2 లక్షల చెక్కును  మొగులయ్య కి అందచేసి సత్కరించారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాకి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. తన ట్రస్ట్ `పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్` నుంచి పవన్ కల్యాణ్  ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.

దర్శనం మొగులయ్య పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో ఇంట్రోని ఆలపించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్‌ గురించి ఆయన ఇచ్చిన సాంగ్‌ ఇంట్రడక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా పవన్‌ తనని ఆదుకోవడంతో మొగులయ్య ఆనందం వ్యక్తం చేశారు. పవన్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

ఇకక పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రానికి  సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా మరో హీరో. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా `భీమ్లా నాయక్‌` చిత్ర టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు