`బిగ్‌బాస్‌5` ఎంట్రీని లీక్‌ చేసిన నటి.. ఎగ్జైట్‌మెంట్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌

Published : Sep 05, 2021, 05:30 PM IST
`బిగ్‌బాస్‌5` ఎంట్రీని లీక్‌ చేసిన నటి.. ఎగ్జైట్‌మెంట్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌

సారాంశం

మరో సినీ, టీవీ నటి కూడా ఉమాదేవి కూడా ఉన్నారు. `కార్తీకదీపం` ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా తన ఎంట్రీని ముందే రివీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. సాయంత్రం షో ప్రారంభం కానున్న నేపథ్యంలో తన ఎంట్రీని లీక్‌ చేసేసింది. 

బిగ్‌బాస్‌5 కి రంగం సిద్ధమైంది. `ఈసారి కిక్‌ టన్నుల్లో ఉంటుందంటు`న్నారు నాగార్జున. దీంతో ఈ సారి బిగ్‌బాస్‌ షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా లీక్‌ చేస్తున్నారు కంటెస్టెంట్లు. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న ఆనందంలో ఎగ్జైట్‌మెంట్‌ తట్టుకోలేక పోస్ట్ లు పెడుతున్నారు. ఇటీవల యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ భావోద్వేగ పోస్ట్‌ ని పంచుకున్నాడు. 

మరో సినీ, టీవీ నటి కూడా ఉమాదేవి కూడా ఉన్నారు. `కార్తీకదీపం` ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా తన ఎంట్రీని ముందే రివీల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. సాయంత్రం షో ప్రారంభం కానున్న నేపథ్యంలో తన ఎంట్రీని లీక్‌ చేసేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ పోస్ట్ ని పంచుకుంది ఉమాదేవి. బిగ్‌బాస్‌ షోలోని తన చిత్రాలను పంచుకుంది. 

ఇందులో ఆమె చెబుతూ, `ప్రతి అమ్మాయి ఏదో సాధించాలని చాలా కష్టపడుతుంది. ఎంతో ఇష్టంతో ఈ కెరీర్‌ను ఎంచుకున్నా. అప్పటినుంచి ఎన్నో మంచి సినిమాలు.. దాదాపు 100కు పైగా సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో ఉన్న పాపులర్‌ కమెడియన్స్‌ అందరితో పని చేశాను. 15కు పైగా సీరియళ్లలో ఎన్నో మంచి పాత్రలు పోషించాను. వాటిలో `చంద్రిక`, `రజిని`, `భాగ్యం` అనే పాత్రలకి ఎంత ఆదరణ చూపించారో మర్చిపోలేను. చాలా ఎంకరేజ్‌ చేశారు. 

ఇప్పుడు నేను నేనుగా ఏంటో తెలుసుకోవడానికి మీకు తెలియజేయడానికి మరో కొత్త అడుగును మీసాక్షిగా వేస్తున్నాను. ఇలాగే సపోర్ట్‌ చేయండి. ఇలాగే నా వెనుక ఉండి, నన్ను సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటూ, నేను ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి కష్టపడతాను. ఇది నా జీవితంలో వేస్తున్న 'బిగ్‌' స్టెప్‌. ఈ సర్‌ప్రైజ్‌ ఏంటో నేడే రివీల్‌ కానుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా బిగ్‌బాస్‌ షోలో తన ఎంట్రీ ఉంటుందని చెప్పకనే చెప్పింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా