'వకీల్ సాబ్' సినిమా పై ఏపీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు !

By Surya PrakashFirst Published Sep 5, 2021, 5:16 PM IST
Highlights

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ పింక్ రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 

శ్రీకాకుళం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి హనుమంతు అప్పయ్యదొర పేరు పెడతామని వెల్లడించారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని స్పష్టం చేశారు. అప్పయ్య దొర ఆశయాలను కొనసాగిస్తామని… వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్యదొరే గుర్తుకు వచ్చారన్నారు. వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని తెలిపారు. సినిమాలో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొరలో ఆ తరహా పోరాటాన్ని తాను స్వయంగా చూశానని వివరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఇక జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ పింక్ రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా కరోనా సమయంలోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు అన్నివర్గాల వారిని ఆకట్టుకున్న వకీల్ సాబ్.. భారీ కలెక్షన్లు సాధిచింది. పింక్ వెర్షన్స్ లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
 
లాయర్ సత్యదేవ్ గా  పవన్ కల్యాణ్.. నందాగా ప్రకాష్ రాజ్ హై ఓల్టేజ్ పర్ఫార్మెన్స్ తో అలరించారు. ఈ సినిమా దాదాపు రూ.80 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన నెలరోజుల్లోనే ఓటీటీలోకి స్ట్రీమ్ అయిన వకీల్ సాబ్ అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. ఈ మూవీని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయగా.. దిల్‌ రాజు నిర్మించారు. 
 

click me!