RRR Postponement:ఆర్ ఆర్ ఆర్ వెనక్కి పోయిందిగా.. భీమ్లా నాయక్ ని ముందుకు తెండి!

Published : Jan 02, 2022, 07:46 AM IST
RRR Postponement:ఆర్ ఆర్ ఆర్ వెనక్కి పోయిందిగా.. భీమ్లా నాయక్ ని ముందుకు తెండి!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా దేశవ్యాపంగా సినీ ప్రేముకులను నిరుత్సాహపరిచిన విషయం. మూడుసార్లు ఇదే జరుగగా... నాలుగో సారి సైతం పునరావృతమైంది. ఐతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఈ న్యూస్ ఆనందం నింపింది. 

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మేకర్స్ ఒత్తిడితో భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. జనవరి 12న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు. ఇది ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురిచేసింది. ఒకింత వారు ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. పాన్ ఇండియా మూవీ అని చెప్పుకుంటూ పవన్ తో పోటీ పడలేకపోయారంటూ... ఎద్దేవా చేశారు. భీమ్లా నాయక్ విడుదలకు సంక్రాంతి బెస్ట్ సీజన్ గా భావించిన ఫ్యాన్స్ ఒత్తిళ్లకు లొంగకుండా చెప్పిన తేదీకి విడుదల చేయాలని కోరుకున్నారు. 

వాయిదా ప్రకటనతో పవన్ (Pawan Kalyan)ఫ్యాన్స్ చాలా ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో దేశంలో పాక్షికంగా లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీలో థియేటర్స్ మూసివేయగా... మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల వాయిదా వేశారు. నిన్న దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. 

ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో ఆనందం నింపింది. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ కావడంతో భీమ్లా నాయక్ (Bheemla Nayak)సంక్రాంతికి విడుదల అవుతుందని వారు భావిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ఫోన్మెంట్ పుకార్లు మొదలైనప్పటి నుండే పవన్ ఫ్యాన్స్ లో ఈ సందడి మొదలైంది. వారు భీమ్లా నాయక్ సంక్రాంతి కి విడుదల అవుతుందంటూ గట్టి విశ్వాసం ప్రకటించారు. మేకర్స్ పరోక్షంగా అలాంటిది ఏమీ లేదని హింట్ ఇచ్చినా... ఫ్యాన్స్ మాత్రం తమ ఆశలకు బ్రేక్ వేయలేదు. 

Also read RRR’s Postponement:వీళ్లు పండగ చేసుకుంటున్నారు

ఇప్పటికి కూడా వారిలో విశ్వాసం ఉంది. ఆర్ ఆర్ ఆర్ తో పాటు రాధే శ్యామ్ (Radhe Shyam)కూడా సంక్రాంతి బరి నుండి తప్పుకుంటున్న నేపథ్యంలో చిన్న చిత్రాలు పండగ చేసుకుంటున్నాయి. నాగార్జున బంగార్రాజు తో పాటు అశోక్ గల్లా 'హీరో' బరిలో దిగింది. అలాగే నాగ వంశీ నిర్మాతగా తెరకెక్కిన చిన్న చిత్రం డీజే టిల్లు విడుదల అవుతుంది. రౌడీ బాయ్స్ సైతం రేసులో ఉన్నట్లు సమాచారం. ఒక దశలో ఆర్ ఆర్ ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ ఇలా బడా బడా స్టార్స్ సంక్రాంతి 2022 పోరులో నిలుస్తారనుకుంటే.. అనూహ్యంగా చిన్న చిత్రాలతో ఈ సంక్రాంతి ముగియనుంది. సినిమా అభిమానులను ఇది తీవ్రంగా నిరాశ పరిచే అంశం. 

Also read RRR Big Breaking: గత్యంతరం లేక `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా.. షాక్‌లో అభిమానులు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్