Sivakarthikeyan:'జాతిరత్నాలు' డైరెక్టర్​ నెక్ట్స్ ప్రకటన, బ్యాక్ డ్రాప్ ఏంటంటే

Surya Prakash   | Asianet News
Published : Jan 02, 2022, 06:32 AM IST
Sivakarthikeyan:'జాతిరత్నాలు' డైరెక్టర్​ నెక్ట్స్ ప్రకటన, బ్యాక్ డ్రాప్ ఏంటంటే

సారాంశం

శివకార్తికేయన్​. 'జాతి రత్నాలు' సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep KV next movie) దర్శకత్వంలో శివకార్తికేయన్​ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏకకాలం చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.


జాతిరత్నాలు సినిమాతో నవ్వించి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్‌. ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు ఎప్పుడా అని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా  తన తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు. తమిళ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌తో ఆయన సినిమాను తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈయనకు ఇదే మొదటి చిత్రం కావటం విశేషం.

 శివ కార్తికేయన్‏కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన రెమో.. వరుణ్ డాక్టర్ సినిమాలో తెలుగులో సూపర్ హిట్ అయి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు కార్తికేయన్. ఈ హీరోకు యూత్‏లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు శివకార్తికేయన్ తెలుగులో సినిమా చేయలేదు. గత కొద్దిరోజులుగా శివకార్తికేయన్ తెలుగులో మూవీ చేయబోతున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆ వార్తలు నిజమంటూ హీరో శివకార్తికేయన్ అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం నేపధ్యం ఏమిటి...ఎలాంటి కథ అనేది చర్చ మొదలైంది. వదలిన ఎనౌన్సమెంట్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా లండన్,పాండిచ్చేరి బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. అలాగే ఫుల్ ఫన్ జర్నీ అని తమన్ చెప్పారు. దీన్ని బట్టి మరో జాతిరత్నాలు ను మించిన సినిమా రాబోతోందని అర్దమవుతోంది. ఇక ఈ సినిమాకు పనిచేసే టెక్నికల్ టీమ్ సైతం హైఎండ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారని సమాచారం.

 సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్‌, శాంతి టాకీస్‌, సురేష్ ప్రొడక్షన్స్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అరుణ్ విశ్వ, సురేష్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని #SK20 వర్కింగ్ టైటిల్‏తో నిర్మించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే