నెట్టింట్లో వైరల్ గా జూనియర్ బండ్ల గణేష్ ఫోటో... జిరాక్స్ కాపీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

By team telugu  |  First Published Aug 4, 2021, 2:44 PM IST

బండ్ల గణేష్ కొడుకు హితేష్ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. అలాగే హితేష్ అచ్చు గుద్దినట్లు మీలానే ఉన్నారన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


నిర్మాత నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ముఖ్యంగా తన దేవుడు పవన్ కళ్యాణ్ పై ఆయన ఆసక్తికర ట్వీట్స్ వేస్తూ ఉంటారు. పవన్ ఇమేజ్ ఆకాశానికి ఎత్తేలా ఉండే బండ్ల గణేష్ ట్వీట్స్ అంటే పవన్ ఫ్యాన్స్ కి మహా ఇష్టం. అందుకే పవన్ ఫ్యాన్స్ కి బండ్ల గణేష్ అత్యంత దగ్గరివాడయ్యారు. 


తాజాగా బండ్ల గణేష్ తన కొడుకు హితేష్ నాగన్ బండ్ల ఫోటో షేర్ చేశాడు. నా పెద్ద కుమారుడు హితేష్ నాగన్ బండ్ల.. అంటూ కామెంట్ పెట్టి స్టైలిష్ గా ఉన్న ఫోటో షేర్ చేశారు. బండ్ల గణేష్ కొడుకు హితేష్ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. అలాగే హితేష్ అచ్చు గుద్దినట్లు మీలానే ఉన్నారన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ బండ్ల గణేష్ అంటూ హితేష్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

Latest Videos


ఇక బండ్ల గణేష్ కి ఇద్దరు కుమారులు కాగా... ఒకరిని సినిమా హీరోని, ఒకరిని డైరెక్టర్ ని చేస్తానని బండ్ల గణేష్ తెలిపాడు. మరోవైపు బండ్ల గణేష్ నిర్మాతగా, పవన్ తో సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఉన్న గబ్బర్ సింగ్ మూవీని నిర్మించింది బండ్ల గణేష్ కావడం విశేషం.

My elder son Hitesh Nagan bandla 🙌🏻 pic.twitter.com/RV3CvznC4F

— BANDLA GANESH. (@ganeshbandla)
click me!