సర్కారు వారి పాట లో భారీ మార్పు... ఆయన స్థానంలో జగపతి బాబు!

By team teluguFirst Published Aug 4, 2021, 2:13 PM IST
Highlights

సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక మహేష్ పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట నుండి క్రేజీ అప్డేట్ రానుంది.

మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ శరవేగంగా జరుపుగుతుంది. కరోనా సెకండ్ వేవ్ వలన ఏర్పడిన బ్రేక్ అనంతరం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. అలాగే సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక మహేష్ పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట నుండి క్రేజీ అప్డేట్ రానుంది. 


అయితే సర్కారు వారి పాట చిత్రం నుండి సీనియర్ హీరో అర్జున్ ని తీసివేసి, ఆయన స్థానంలో జగపతి బాబును తీసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. కథ రీత్యా పోలీస్ అధికారి పాత్ర ప్రధానంగా సాగుతుందట. హీరోకి పోటీ ఇచ్చే రీతిలో ఉండే ఈ పాత్ర కోసం మొదట అర్జున్ ని అనుకున్నారు. సర్కారు వారి పాట చిత్రంలోని పాత్రకు అర్జున్ ఓకె చెప్పడం జరిగింది. 


ఇక షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉన్న అర్జున్ ని తప్పించి జగపతి బాబును తీసుకున్నారట. ఈ పాత్రకు అర్జున్ కంటే జగపతి బాబే న్యాయం చేయగలరని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మధ్య మాస్, క్లాస్, విలన్, క్యారెక్టర్ రోల్ అనే బేధం లేకుండా అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు జగపతి బాబు. 


సౌత్ ఇండియాలో స్టార్ ఆర్టిస్ట్ గా ఆయన మారడం జరిగింది. ఆయన నటించిన నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, రంగస్థలం వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. ఇక సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

click me!