నక్కతోక తొక్కిన నభా నటేష్‌.. ఏకంగా హృతిక్‌ రోషన్‌ సరసన ?

Published : Aug 04, 2021, 11:55 AM IST
నక్కతోక తొక్కిన నభా నటేష్‌.. ఏకంగా హృతిక్‌ రోషన్‌ సరసన ?

సారాంశం

నభా నటేష్‌ లక్కీ ఛాన్స్ కొట్టింది. బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకుంటుంది. ఏకంగా హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించబోతుంది. ఈ న్యూస్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

`ఇస్మార్ట్ శంకర్‌` భామ నభా నటేష్‌ నక్క తోక తొక్కిందట. ఏకంగా బాలీవుడ్‌ ఆఫర్‌ని అందుకుంది. అది కూడా స్టార్‌ హీరో హృతిక్‌తో కలిసి నటించే ఛాన్స్ ని అందుకుంది. హృతిక్‌ రోషన్‌ సరసన ఓ వెబ్‌సిరీస్‌లో నటించబోతుంది నభా. `ది నైట్‌ మేనేజర్‌` అనే బ్రిటీష్‌ టీవీ సిరీస్‌ ఆధారంగా హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ఫీమేల్‌ లీడ్‌ కోసం నభాని సంప్రదించగా, దాదాపు ఆమె ఓకే చెప్పిందని సమాచారం. 

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో దర్శకుడెవరు ? మిగిలిన కాస్ట్ అండ్‌ క్రూ డిటేయిల్స్  త్వరలోనే వెల్లడి కానున్నాయట. అదే నిజమైతే నభా నటేష్‌ నక్కతోక తొక్కిందనే చెప్పొచ్చు. అదే సమయంలో బాలీవుడ్‌ ఎంట్రీ ఓ స్టార్‌ హీరోతో కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే వెబ్‌ సిరీస్‌లు చేయడం ఇటు నభాకి, అటు హృతిక్‌కిదే ఫస్ట్ కావడం విశేషం. ప్రస్తుతం నభా నటేష్‌ నితిన్‌తో `మ్యాస్ట్రో` చిత్రంలో నటిస్తుంది. ఇది బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ `అంధాధున్‌` రీమేక్. మరోవైపు హృతిక్‌ రోషన్‌ ప్రస్తుతం `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?