తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!

Published : Nov 20, 2018, 05:06 PM ISTUpdated : Nov 20, 2018, 05:09 PM IST
తన పొలిటికల్ ఫిల్మ్ పై పవన్ క్లారిటీ!

సారాంశం

పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తున్నారు. 'జనసేన' పార్టీ పనులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత రెండు రోజులుగా ఆయన తిరిగి సినిమాలలో నటించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. 

పవర్ స్టార్ పవన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తున్నారు. 'జనసేన' పార్టీ పనులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత రెండు రోజులుగా ఆయన తిరిగి సినిమాలలో నటించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి.

ఎలెక్షన్స్ కి ముందు ఓ పొలిటికల్ సినిమాలో నటించాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. పవన్ అనుచరుల్లో ఒకరు నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు, 'గోపాల గోపాల' ఫేమ్ దర్శకుడు డాలీ డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నట్లు రకరకాల వార్తలు వచ్చాయి. 

దాదాపు అన్ని మీడియా వర్గాలు ఈ న్యూస్ ని కవర్ చేశాయి. రాజకీయాల్లో పవన్ పాత్రను ప్రొజెక్ట్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. తాజాగా ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు.

''నేను త్వరలో సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదు. ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకారం తెలుపలేదు. సినిమాలో నటించడానికి అవసరమైన సమయం లేదు. ప్రజా జీవితానికి పూర్తి సమయం కేటాయించాను. ప్రజల్లోనే ఉంటూ, జనసైనికులు, అభిమానులతో కలిసి పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తోన్న తరుణమిది. సినిమాలపై దృష్టి సారించడం లేదు. నా ఆలోచనలన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే'' అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

దీనిని బట్టి చూస్తుంటే.. పవన్.. రాజకీయాల్లో పూర్తిగా సెటిల్ అయిపోవాలనే నిర్ణయంతోనే ఈ వైపు అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఆయన సినిమాలు చేయకపోతే.. ఆయన అభిమానులు ఏమౌతారో ఏమో..?

పొలిటికల్ చిత్రంలో పవన్, డైరక్టర్ ఎవరంటే..?

బ్రేకింగ్ అప్డేట్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ పవర్ఫుల్ మూవీ?

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు