‘బ్రో’కి ఏపీలో కష్టాలు,ఎగ్జిబిటర్స్ కొత్త ట్విస్ట్? అలాగైతేనే తీసుకుంటాం?

Published : Jul 13, 2023, 07:08 AM IST
 ‘బ్రో’కి ఏపీలో కష్టాలు,ఎగ్జిబిటర్స్ కొత్త ట్విస్ట్? అలాగైతేనే తీసుకుంటాం?

సారాంశం

పవన్ .. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది. 


 పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. జులై 28న విడుదలవుతున్న ఈ చిత్ర నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయనే సంగతి తెలిసిందే. అయితే.. ఆంధ్రలో మాత్రం పరిస్దితి వేరే రకంగా ఉన్నట్లు వార్తలు వస్తన్నాయి. ఎగ్జిబిటర్లు అంతెంత రేట్లు పెట్టి తీసుకోవటానికి ‘బ్రో’ మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్తున్నారు. అందుకు కారణం అక్కడ హఠాత్తుగా మొదలైన రాజకీయకారణాలుగా చూపెడుతున్నారు.

  తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు విడుదలకు కష్టాలు తప్పకపోవచ్చు అని వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి భావిస్తున్నారు. గత కొద్ది రోజు లుగా పవన్ కళ్యాణ్ తన జనసేన రాజకీయ పార్టీ ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన వాలంటీర్స్ పై  చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయంగా సంచలనం కలిగించాయి. దాంతో అధికార పార్టీ వైస్సార్సీపీ, పవన్ కళ్యాణ్ మధ్య  డైరక్ట్ వార్ కు తెర తీసినట్లైంది. దాంతో, “బ్రో” సినిమా విడుదల ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందా అన్న అనుమానాలు అంతటా మొదలయ్యాయి.

 ఇప్పటికే విడుదలైన టీజర్, ‘మై డియర్ మార్కండేయ’ ఫస్ట్ సింగిల్.. మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే థియేట్రికల్ రైట్స్ సైతం భారీ ధరకు (Bro Theatrical Rights) అమ్ముడుపోయాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం.. అన్ని ఏరియాల్లో ‘బ్రో’ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. నైజాం ఏరియా రూ. 30 కోట్లు (GST సహా), ఆంధ్ర (6 ఏరియాస్, GST సహా) 40 కోట్ల నిష్పత్తిలో అమ్మారు. సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 13.5 కోట్లకు అమ్ముడయ్యాయి. 

నైజాం ఏరియాలో టికెల్ ధరలు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175/, మల్టీప్లెక్స్‌లలో రూ. 295/-.  కాబట్టి ఈ ప్రాంతంలో ఈ సినిమాపై పెట్టుబడి రికవరీ ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా నల్లేరు మీద నడకే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గరిష్టంగా టిక్కెట్ ధర సింగిల్ స్క్రీన్స్‌లో 145/- & మల్టీప్లెక్స్‌లలో రూ. 177/- మాత్రమే ఉన్నాయి.  అయితే ఈ ధరలు కూడా A సెంటర్స్‌లో మాత్రమే. కొన్ని చోట్ల అతి తక్కువగా రూ. 90/- కూడా ఉంది. దాంతో రికవరీ ఉండదు.

అంతేకాదు..ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు అనేది ఉండకపోవచ్చు. థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలకు మించి షోలు పడకపోవచ్చు. ఇది ఎగ్జిబిటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు కాదు.  అందుకే, ఈ సినిమా విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఎగ్జిబిటర్స్...ఫిక్సెడ్ హైర్స్ కానీ మినిమం గ్యారెంటీలకు కానీ తీసుకోకుండా కేవలం రికవరబుల్ మినిమల్ అడ్వాన్స్ లు మాత్రమే ఇవ్వాలని డిసైడ్  అయ్యారట. అయితే ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో  ప్రచారంలో ఉన్నవి మాత్రమే. ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..