Bigg Boss Telugu 7 : ‘బిగ్ బాస్ 7’లో బ్యాంకాక్ పిల్ల? ఇండియాకు చేరుకున్నది అందుకేనా!

By Asianet News  |  First Published Jul 12, 2023, 9:01 PM IST

టీవీ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss Telugu Season 7 తర్వలో ప్రారంభం కాబోతోంది. రీసెంట్ గా ప్రోమో విడుదలైన మరింత ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
 


విదేశాల్లో ప్రారంభమైన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ప్రస్తుతం ఇండియా మొత్తం పాకిన విషయం తెలిసిందే. తొలుత హిందీలో ప్రసారమై.. నెమ్మదిగా ప్రాంతీయ భాషలకు కూడా వ్యాపించింది. ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తిచేసుకున్న ఈ రియాలిటీ షో తదుపరి సీజన్ కోసమూ ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. 

రీసెంట్ గా బిగ్ బాస్ 7కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. కేవలం టైటిల్ లోగోను రివీల్ చేశారు. మరేతర వివరాలను వెల్లడించలేదు.  ఇక షోకు సపంబంధించిన మరిన్ని డిటేయిల్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రతిసారి హౌజ్ లోకి కొత్తవారిని ఇన్వైట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి యూట్యూబర్ గా గుర్తింపు దక్కించుకున్న ‘బ్యాంకాక్ పిల్ల’ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

Latest Videos

Bangkok Pilla యూట్యూబ్ ఛానెల్ తో శ్రావణి సమంతపూడి ఫేమ్ దక్కించుకుంది. యూట్యూబ్ యూజర్లకు ఈమె బాగా సుపరిచితం. తెలుగు భాషా, యాసతో బ్యాంకాక్ నుంచి వరుసగా వీడియోలు షేర్ చేస్తుంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ అందించేది. అయితే, ఈమె విజయనగరానికి చెందినదే కావడంతో ‘బిగ్ బాస్ 7’లోకి తీసుకురాబోతున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిన్నే శ్రావణి కుటుంబంతో సహా ఇండియాకూ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసింది.ఈ క్రమంలో త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

గతేడాది బిగ్ బాస్ తెలుగు 6లో చూస్తే హౌజ్ లో 21 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈసారి మాత్రం 25 మందిని తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఒక డివోర్స్ జంట కూడా ఉంటుందని కూడా అంటున్నారు. ఇప్పటికే కొందరు పేర్లు కాంటెస్టెంట్లుగా వినిపిస్తోంది. ఇందులో సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబర్స్, సింగర్స్, కమెడియన్స్ ను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీజన్6 చాలా మేరకు విమర్శలు అందుకుంది. ఈసారి వాటన్నింటినీ సరిచేసేలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు హోస్ట్ విషయంలోనూ పలువురు స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిపైనా మున్ముందు అప్డేట్స్ అందాల్సి ఉంది.

click me!