మహేష్, ప్రభాస్ మాత్రమే.. బాహుబలి షేడ్.. సాహో రిజల్ట్ పై పరుచూరి!

By tirumala ANFirst Published Sep 20, 2019, 6:28 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ విడుదలయ్యాక సాహో అంచనాలు అందుకోలేకపోయింది. 

సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తాజాగా సాహో చిత్ర ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఎందుకు అంచనాలు అందుకోలేకపోయిందో తన విశ్లేషణని అందించారు.  సాహో చిత్రాన్ని కొన్ని విభాగాల్లో మాత్రమే ఓహో అనిపించింది. టెక్నికల్ గా ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడానికి చాలా శ్రమపడ్డారు. 

లేడీస్ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ మాత్రమే. అలాంటి హీరోలతో ఎలాంటి అద్భుతాలైనా చేయొచ్చు. మొదటి నేను సాహోమొ జేమ్స్ బాండ్ తరహా చిత్రం అనుకున్నా. అందుకే భారీగా ఖర్చుచేస్తున్నారని భావించా. ఇక చాలా చిత్రాల్లో కథాంశం ఒక్కటే ఉంటుంది.. కథనం మాత్రమే వేరేగా ఉంటారు. అర్జున్ రెడ్డి, దేవదాసు కథాంశం ఒకటే అని చెప్పినప్పుడు చాలా మంది నన్ను విమర్శించారు. 

ఇప్పుడు చెబుతున్నా.. బాహుబలి, సాహో కథాంశం ఒక్కటే. బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యం.. సాహోలో మాఫియా సామ్రాజ్యం. బాహుబలిలో తండ్రిని చంపిన వాడిని కొడుకు హతమార్చి సింహాసనం అధిరోహిస్తాడు.. ఇక సాహోలో కూడా అంతే. ఈ చిత్రంలో 1 నేనొక్కడినే చిత్రంలో జరిగిన పొరపాట్లు రిపీట్ అయ్యాయి. 

ఫస్ట్ హాఫ్ లో హీరోని హీరోయిన్ డామినేట్ చేసినట్లు అనిపించింది. ప్రతీకార కథ అని తెలియకుండా ట్విస్ట్ లు పెడితే ప్రయోజనం ఉండదు. దాదాపు అర్థ గంట పాటు క్లైమాక్స్ ఉండడం కూడా మైనస్సే. నటనని పక్కన పెట్టి కేవలం యాక్షన్ సన్నివేశాలతో మెప్పించడం కష్టం. ప్రభాస్ గత చిత్రాలన్నీ యాక్షన్ కంటే అతడి పెర్ఫామెన్స్ ఆధారంగానే విజయం సాధించాయి అని పరుచూరి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఏది ఏమైనా సాహో చిత్రానికి మంచి వసూళ్లు రావడం శుభపరిణామం అని అన్నారు. 

click me!