బందోబస్త్ మూవీ రివ్యూ

By tirumala AN  |  First Published Sep 20, 2019, 5:30 PM IST

విలక్షణ నటుడిగా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. సూర్య నటించే చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం లాంటి చిత్రాలతో సూర్యకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక సూర్య, స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. 


విలక్షణ నటుడిగా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య. సూర్య నటించే చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గజినీ, సింగం లాంటి చిత్రాలతో సూర్యకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక సూర్య, స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు విజయం సాధించాయి. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న బందోబస్త్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. బందోబస్త్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం!

కథ:

Latest Videos

undefined

ప్రజలకు, దేశానికి మంచి చేయాలని భావించే ప్రధాన మంత్రి చంద్రకాంత్ వర్మ(మోహన్ లాల్). ఆయన చాలా సిన్సియర్ పొలిటీషియన్. చాలా క్లిష్టమైన పనులని కూడా సులువుగా ముగించే అధికారి రవి కిషోర్(సూర్య). రవి కిశోర్ తన పనితనంతో ప్రధాన మంత్రికి బాగా సన్నిహితుడిగా మారిపోతాడు. కానీ కొంతకాలానికి ఓ అటాక్ లో ప్రధాన మంత్రి మరణిస్తారు. ఆ అటాక్ ఎవరు చేశారు ? ప్రధాని మరణానికి కారకులు ఎవరు? సూర్య వారిని ఎలా బయటకు లాగాడు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

ఇలాంటి పోలీస్ అధికారి పాత్రలకు సూర్య అద్భుతంగా సరిపోతాడు. ఈ చిత్రంలో కూడా సూర్య పవర్ ఫుల్ కాప్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడు. సూర్య యాక్షన్ సన్నివేశాల్లో ఎలా నటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎమోషనల్ సన్నివేశాలని కూడా సూర్య తనదైన నటనతో పండించాడు. 

ఇక ప్రధానమంత్రిగా మోహన్ లాల్ పాత్ర కూడా బావుంది. ఆ పాత్రలో మోహన్ లాల్ చాలా హుందగా కనిపించారు. ప్రధమంత్రిగా ఆయన నటన అందరిని ఆకర్షిస్తుంది. సాయేషా ఈ చిత్రంలో చాలా అందంగా కనిపించింది. సూర్య, సాయేషా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. 

ఈ చిత్రానికి ప్రధాన బలం అంటే అది ఇంటర్వెల్ సన్నివేశమే. సెకండ్ హాఫ్ కి ఇంటర్వెల్ సన్నివేశం మంచి ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసింది. క్లైమాక్స్ ని కూడా బాగా డిజైన్ చేశారు. ప్రధానిపై అటాక్ చేసే సన్నివేశాలు మంచి అటెన్షన్ తీసుకుంటాయి. సూర్య చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. 

మైనస్ పాయింట్స్ :

బందోబస్త్ చిత్రం కథ పరంగా బావుంది. కానీ సినిమాలో చాలా సన్నివేశాలు కథని సైడ్ ట్రాక్ లోకి నెట్టేశాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలని అనవసరంగా సాగదీశారు. దర్శకుడు కెవి ఆనంద్ రూపొందించిన స్క్రీన్ ప్లే లో అనేక లోపాలు ఉన్నాయి. సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులని తికమక పెడుతోంది. అసలు పాత్రల ప్రాధాన్యత ఏమిటో అర్థం కాని విధంగా ఉంటుంది. 

సూర్య, సాయేషా మధ్య లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునే విధంగా లేదు. వారిద్దరూ స్క్రీన్ అపి కనిపించిన ప్రతిసారి కథ నుంచి పక్కకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు లేకపోవడం కూడా మైనస్ అని చెప్పొచ్చు. 

దర్శకుడి పనితనం :

ఈ చిత్రం కోసం దర్శకుడు కెవి ఆనంద్ రూపొందించుకున్న కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, సప్సెన్స్ సన్నివేశాలు బావున్నాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా, దర్శకుడిగా ఈ కథకు పూర్తి న్యాయం చేయలేకపోయారు. కొన్ని సన్నివేశాలని సాగదీయకుండా తెరకెక్కించి ఉంటే ఇంకాస్త బావుండేది. 

ఫైనల్ గా : 

మొత్తంగా చెప్పాలంటే బందోబస్త్ కొన్ని సన్నివేశాలలో మాత్రమే ఆకట్టుకునే యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలోని రాజకీయ అంశాలు, థ్రిల్ ని కలిగించే కొన్ని సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కొంత వరకు ఆకట్టుకుంటాయి. సినిమా రన్ టైం ఎక్కువ కావడం, సాగదీసిన కొన్ని సీన్స్ బోర్ కొట్టిస్తాయి. సూర్య, మోహన్ లాల్ నటన కోసం మాత్రమే ఈ చిత్రాన్ని చూడవచ్చు. 

రేటింగ్ : 2.25

 

click me!