వరల్డ్ పేమస్ లవర్.. దేవరకొండ షాకింగ్ లుక్

Published : Sep 20, 2019, 05:55 PM ISTUpdated : Sep 20, 2019, 06:10 PM IST
వరల్డ్ పేమస్ లవర్.. దేవరకొండ షాకింగ్ లుక్

సారాంశం

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ పేమస్ లవర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. రీసెంట్ గా టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన రౌడీ స్టార్ ఇప్పుడు ఊహించని లుక్ తో దర్శనమిచ్చాడు. సినిమాలో లవర్ బాయ్ గా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడనుకున్న విజయ్ మరో అర్జున్ రెడ్డిలా లవ్ ఫెయిల్యూర్ లా కనిపిస్తున్నాడు. 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. రీసెంట్ గా టైటిల్ తో ఎట్రాక్ట్ చేసిన రౌడీ స్టార్ ఇప్పుడు ఊహించని లుక్ తో దర్శనమిచ్చాడు. సినిమాలో లవర్ బాయ్ గా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడనుకున్న విజయ్ మరో అర్జున్ రెడ్డిలా లవ్ ఫెయిల్యూర్ లా కనిపిస్తున్నాడు. 

మొదటి నుంచి సినిమాలో హీరో క్యారెక్టర్ పై అనేక రకాల రూమర్స్ వినిపించాయి. మెయిన్ గా ప్లే బాయ్ లా విజయ్ నటిస్తున్నట్లు కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ విజయ్ రూమర్స్ కి కౌంటర్ ఇచ్చే విధంగా ప్రేమలో విఫలమైన అగ్రేషన్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. మరో వైపు నుంచి అది పిచ్చోడి క్యారెక్టర్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. 

రాశి ఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేష్ - క్యాథెరిన్ - ఇజబెల్లె వంటి బ్యూటిఫుల్ హీరోయిన్స్ విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడంతో త్వరలో రానున్న టీజర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మరి చిత్ర యూనిట్ టీజర్ తో ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?