పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో చిత్రం PVT04 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యూనిట్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించారు. ముఖ్యంగా సంగీతంపై అంచనాలు పెంచేశారు.
పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) - క్రేజీ హీరోయిన్ శ్రీ లీలా (Sree Leela) జంటగా నటిస్తున్న చిత్రం PVT04. డెబ్యూ డైరెక్టర్ ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.
అయితే చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల, జోజు జార్జ్ చేరడంతో పాటు మరో యంగ్ హీరోయిన్ కూడా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. న్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ (Aparna Das) 'PVT04' చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు.
పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ లో నాలుగో చిత్రంగా రూపొందుతోన్న PVT04 లో అపర్ణా దాస్ వజ్ర కాళేశ్వరి దేవి పాత్రను పోషిస్తున్నారు. సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటిస్తున్న అపర్ణ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో పాత్రకు న్యాయం చేస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రబృందం పక్కా ప్రణాళికతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అపర్ణ ఇటీవల తమిళంలో నటించిన దాదా చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా అందింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను నెక్ట్స్ లెవల కు తీసుకెళ్లేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) రంగంలోకి దిగుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన సార్/వాతితో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన విషయం తెలిసిందే.
PVT04 ఆల్బమ్ ఖచ్చితంగా మరో పెద్ద చార్ట్‌బస్టర్‌గా కానుందని చిత్రం బృందం నమ్మకంగా ఉంది. త్వరలో గ్లింప్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో థియేటర్లలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆసక్తిని పెంచింది. మన్ముందు వచ్చే అప్డేట్స్ మరింత ఆకట్టుకునేలా ఉంటాయని యూనిట్ అంటున్నారు. చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.