ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు హరీష్ శంకర్. ఈక్రమంలో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ స్పెషల్ లుకు ను ఈ ఈ సినిమా నుంచి రిలీజ్ చేశారు టీమ్..
పాలిటిక్స్ కు కాస్త గ్యాప్ ఇంచ్చి సినిమాలు కంప్లీట్ చేసేపనిలో పడ్డాడు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. ఇందులో భాగంగా.. చాలా కాలంగా వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ కు సాలిడ్ గా టైమ్ కేటాయించాడు. ఇక ఉన్న సమయాన్ని...యూస్ చేసుకోవడంతో హరీష్ శంకర్ దిట్ట.. ఈ టైమ్ గ్యాప్ లోనే ఉస్తాద్ షూటింగ్ ను పరుగులు పెట్టించి.. పవర్ స్టార్ కు సబంధించిన మేజర్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. అంతే కాదు ఉస్తాద్ నుంచి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. అంతే కాదు ఈమూవీ నుంచి ఫ్యాన్స్ కు డబుట్ ట్రీట్ దొరకబోతున్నట్టు తెలుస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ని ఈరోజు(11 మే) సాయంత్రం 4.59 కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ని మరింత జోష్ లో నింపడానికి తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A saviour with style and swag ❤️🔥
And we call him - 🔥🔥🔥
Get ready for the today at 4.59 PM ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/ad5ISFDbl2
పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో చాలా స్టైలిష్ గా నించొని కనిపించాడు.. ఈ పోస్టర్ లో పోలీసుల బారికేడ్లు.. పోలీసులతో పాటు కామన్ పీపులు కూడా కనిపించే విధంగ పోస్టర్ డిజైన్ చేశారు. ఇక్కడ ఏదో ఫైట్ సీన్ జరగబోతోందతి అన్నట్టు వాతావరణం తయారయ్యింది. ఇక ఈసినిమాలో పవన్ మరో లుక్ లో కూడా కనిపించబోతున్నాట్టు సమాచారం. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ ను అదిరిపోయే పోలీస్ లుక్ లో చూపించాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ లో చాలా స్టైలీష్ గా చూపించాడు. ఇక ఈమూవీలో పోలీస్ లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఉస్తాద్ అనే పాత్రతో పాటుభగత్ సింగ్ అనే మరో పాత్ర కలుపుకుని డ్యూయల్ రోల్స్ కాని.. డ్యూయల్ క్యారెక్టర్ ఒక్కడే చేయడం లాంటి ట్విస్ట్ లు ఉన్నాయి ఈసినిమాలో అంటున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో నిజమెంతో చూడాలి.