దిల్ రాజు ‘రౌడీ బాయ్స్‌’ టీజర్ :శేఖర్ కమ్ముల చిత్రం గుర్తొస్తోంది

By Surya PrakashFirst Published Sep 21, 2021, 7:20 AM IST
Highlights

టీజర్ చూస్తే  సినిమా మొత్తం కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్‌ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్‌లో చూపించారు.   

 ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ఒకరు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌.  హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. టీజర్ చూస్తే  సినిమా మొత్తం కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందని అర్ధమవుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్‌ కోసం ఇద్దరు గొడవ పడటం వంటివి టీజర్‌లో చూపించారు.  టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.


ఈ చిత్ర  టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, దేవీశ్రీప్రసాద్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ...‘‘ఇది పూర్తి యూత్‌ఫుల్‌ చిత్రం. ఆశిష్‌ కొత్తవాడిగా కాకుండా బాగా చేశాడు. అనుమపను చూసి ఆశ్చర్యపోతారు. దసరాకు చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని యోచిస్తున్నాం. అందరూ వచ్చి కొత్త వారిని ఆశీర్వదించండి’’ అన్నారు.

 కాలేజీ ప్రేమలు.. ఆ ప్రేమ కోసం విద్యార్థుల మధ్య జరిగే గొడవలు తదితర అంశాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ ని బట్టి అర్థమవుతోంది. ఈ టీజర్ చూసిన వారికి హ్యాపీ డేస్ సినిమా గుర్తు వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం పూర్తిగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చగా, మది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.శశిదేవ్‌ విక్రమ్‌, కార్తిక్‌ రత్నం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

click me!