
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. టెలివిజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ అమేజింగ్ అని చెప్పాలి. ఆయన బుల్లితెర మొదటి ప్రయత్నం బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్. అసలు ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని బిగ్ బాస్ షోని ఆయన టాప్ రేటింగ్ తో నడిపారు. ఇక సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్నారు.
కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నుండి ఫ్రీ అయిన ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు సెలబ్స్ షోకి గెస్ట్స్ గా వస్తుండగా, లేటెస్ట్ ఎపిసోడ్ కి కొరటాల శివ, రాజమౌళి రావడం జరిగింది. హాట్ సీట్ లో కూర్చున్న కొరటాల, రాజమౌళిని ఎన్టీఆర్ తనదైన శైలిలో ప్రశ్నించారు.
ఇక షోలో ఈ ముగ్గురు స్టార్ సెలెబ్స్ మధ్య ఆసక్తికర సంభాషణ జరుగగా, ఎన్టీఆర్ 30 మూవీపై అప్డేట్ ఇచ్చారు కొరటాల శివ. వచ్చే నెలలో ఎన్టీఆర్ 30 మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఆయన తెలియజేశారు. కొరటాల శివ ఎన్టీఆర్ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే తెలియజేశారు.