మోడలింగ్ లో అందాల ఆరబోత తప్పనిసరి. ఎందుకంటే మోడలింగ్ అంటేనే అదొక గ్లామర్ ప్రపంచం కనుక. ఎంతమంది వయ్యారి భామలు కళ్ళముందు మెరిసినా వారిలో కొందరు మోడల్స్ మాత్రమే గుర్తుండిపోయే సౌందర్యాన్ని కలిగిఉంటారు. ఆ కోవలోకి చెందిన పిల్లే దియా అలీ. కొత్తగా వింటున్నారు కదూ. నిజమే పాక్ కు చెందిన ఈ భామ ఓవర్ నైట్ లో ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇటీవల దియా అలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ పిక్ యువత హార్ట్ బీట్ అమాంతం పెంచే విధంగా ఉన్నాయి.
నిన్న మొన్నటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేనిపేరు దియా అలీ. పాక్ లో ప్రముఖ మోడల్ అయినప్పటికీ దియా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇటీవల దియా అలీ తన బికినీ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెటింది. అప్పటి నుంచి దియా ఇంటర్ నెట్ లో సంచలనంగా మారిపోయింది. దియా అలీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాని కుదుపు కుదిపేస్తున్నాయి. యువత హృదయాలకు చిల్లులుపడేలా ఆమె చూపులు ఉన్నాయనడం అతిశయోక్తి కాదు.
2016 లో దియా అలీ పాక్ తరుపున మిస్ ఏషియా పసిఫిక్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ కిరీటం అందుకున్న ఏకైక పాక్ మోడల్ దియా అలీ కావడం విశేషం.యువతకు ప్రస్తుతం దియా అలీ జ్వరం పట్టుకుంది. దియా అలీ బికినీ ఫోటోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారాయి. దియా సొగసులు కుర్రకారు ఫిదా అవుతున్నారు.