కళ్యాణ్ రామ్ కు పోసాని బంపర్ ఆఫర్

Published : Mar 21, 2018, 03:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
కళ్యాణ్ రామ్ కు పోసాని బంపర్ ఆఫర్

సారాంశం

నిన్న ఎమ్ ఎల్ ఏ ఆడియో రిలీజ్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విపరీతంగా పొగిడేయటం కనిపిస్తుంది​ తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు​

నిన్న ఎమ్ ఎల్ ఏ ఆడియో రిలీజ్ లో పోసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ముఖం మీదనే తిట్టాలన్నా.. పొగడాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. సాధారణంగా సినిమా ఫంక్షన్లలో విపరీతంగా పొగిడేయటం కనిపిస్తుంది. అంతేకానీ.. హీరోను నువ్వు అది అయిపో.. ఇది అయిపో అనేది దాదాపుగా ఉండదు. కానీ.. పోసాని ఆ అడుగు వేసేశారు. కల్యాణ్ రామ్ ను ఉద్దేశించి చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడిన పోసాని.. కీలక వ్యాఖ్యలు చేశారు.

చాలామంది హీరోలు అవుతారని.. వేల కోట్ల రూపాయిలు సంపాదిస్తారన్నారు. దీనికి హరికృష్ణ.. కల్యాణ్ రామ్ లు భిన్నమన్నారు. అందుకే కల్యాణ్ రామ్ సక్సెస్ కావాలన్నారు. అన్నింటికి మించి రాజకీయంగా కల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావటం తనకు ఇష్టమన్నారు. 

ఎందుకా మాట తాను చెబుతున్నానంటే అని చెబుతూ.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు. సమాజం బాగుపడుతుంది అని వ్యాఖ్యాలు చేశారు. పోసాని మాటలకు కంటిన్యూషన్ గా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ. పోసాని చెప్పినట్లు కల్యాణ్ రామ్ ఎమ్మెల్యే కావాలని చాలామంది కోరుకుంటారని.. ఆయన మంచి లక్షణాలున్న అబ్బాయి అన్న దానికి చక్కటి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీలో కొత్త సమీకరణాలు తీసుకొచ్చే దిశగా పోసాని తెలిసో.. తెలియకో ఒక మాట అనేశారని చెప్పక తప్పదు. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?